Niharika | బాబాయ్ డేట్స్ ఇస్తే నా సినిమాకి తీసుకుంటా.. ‘రాకాస’ ప్రమోషన్స్‌లో నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు

Niharika | మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇందుకోసం ఆమె స్థాపించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై విభిన్న కథలతో సినిమాలు నిర్మిస్తోంది. 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు ‘రాకాస’ అనే ఫాంటసీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  • By: sn |    movies |    Published on : Mar 02, 2026 10:18 AM IST
Niharika | బాబాయ్ డేట్స్ ఇస్తే నా సినిమాకి తీసుకుంటా.. ‘రాకాస’ ప్రమోషన్స్‌లో నిహారిక కొణిదెల ఆసక్తికర వ్యాఖ్యలు

Niharika | మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా పరిచయమైన నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇందుకోసం ఆమె స్థాపించిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై విభిన్న కథలతో సినిమాలు నిర్మిస్తోంది. 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నిహారిక, ఇప్పుడు ‘రాకాస’ అనే ఫాంటసీ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ‘రాకాస’ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మెగా కుటుంబంలో ఒకరి సినిమాలకు మరొకరు సపోర్ట్ చేయడం సహజమే. గతంలో తన తొలి నిర్మాణం ‘కమిటీ కుర్రోళ్లు’కి పవన్ కళ్యాణ్‌తో ప్రమోషన్ చేయించాలని ప్రయత్నించానని, అయితే అది సాధ్యపడలేదని ఆమె వెల్లడించింది.

ఇప్పుడు ‘రాకాస’ ప్రమోషన్స్‌లో అయినా పవన్ కళ్యాణ్ భాగం అవుతారా? అనే ప్రశ్నకు నిహారిక నవ్వుతూ స్పందించింది. “ఉస్తాద్ భగత్ సింగ్‌కు కళ్యాణ్ బాబాయ్ డేట్స్ ఇస్తే, అందులో ఒకటో రెండో నాకు వస్తే తీసుకుంటాను. ముందుగా ఆయన సినిమాకు ఆయన ప్రచారం చేసుకోవాలి. నిజానికి ఆయన సినిమాలకు ప్రచారం అక్కర్లేదు. ఆయన ‘ఉస్తాద్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు వస్తే, నేను కూడా నా సినిమా కోసం ప్రయత్నిస్తాను” అని చెప్పింది. కెమెరా ముందుకు వచ్చి ప్రమోట్ చేసినా చేయకపోయినా, తనకు కుటుంబం ఉన్నందునే ధైర్యంగా ముందుకు సాగుతున్నానని ఆమె పేర్కొంది.

ఈ సందర్భంగా ఓ అభిమాని “బాబాయ్ బాగున్నాడా?” అని అడగగా, “సూపర్… వాళ్లు బాగున్నారు కాబట్టే నేను కూడా బాగున్నాను” అంటూ ఆమె సమాధానం ఇచ్చింది.ఇంకా మాట్లాడుతూ, “పింక్ ఎలిఫెంట్ నుంచి ఎలాంటి కంటెంట్ రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నారు. నా పదేళ్ల జర్నీలో భాగమయ్యారు. కింద పడినప్పుడు సూచనలు చేశారు, బాగా చేసినప్పుడు మెచ్చుకున్నారు. అందుకే మీరు నా ఫ్యామిలీ అని ఫీల్ అవుతాను” అని అభిమానులపై తన ప్రేమను వ్యక్తం చేసింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాను మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మించానని, అదే మోటోతో ‘రాకాస’ను కూడా రూపొందించామని నిహారిక తెలిపింది. “థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులను అస్సలు నిరాశపరచదు. నెక్ట్స్ లెవెల్ ఎంటర్టైన్‌మెంట్ ఇస్తుంది. ఈ సినిమా చూసేద్దాం అనిపించేలా రాబోయే రోజుల్లో ప్రమోషన్స్ చేస్తాం” అని ఆమె ధీమా వ్యక్తం చేసింది.