గుంటూరు కారం తెలుగులో నా చివ‌రి సినిమా.. అందుకే ఆ రేంజ్‌లో డ్యాన్స్ చేశాన‌న్న మ‌హేష్‌

గుంటూరు కారం తెలుగులో నా చివ‌రి సినిమా.. అందుకే ఆ రేంజ్‌లో డ్యాన్స్ చేశాన‌న్న మ‌హేష్‌

బాల నటుడిగా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోల‌లో ఒక‌రిగా స‌త్తా చాటుతున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. ఈయ‌న‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు మ‌హేష్ బాబు.అతడు, ఖలేజా వంటి బ్లాక్ బస్టర్ హిట్టు చిత్రాల త‌ర్వాత మ‌హేష్‌- త్రివిక్ర‌మ్ కాంబోలో ఈ చిత్రం రూపొందింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీగా వసూళ్లును రాబట్టుకుంటుంది. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమాను చూసేందుకు ప్రేక్ష‌కులు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో పాట‌లకి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. దమ్ మసాలాతో పాటు కుర్చి మడతపెట్టి పాటకు ప్ర‌తి ఒక్క‌రు తెగ స్టెప్పులు వేస్తున్నారు. ఇక మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న నేప‌థ్యంలో మహేష్ బాబు, శ్రీలీల ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేశారు. తాను చేయబోయే చివరి తెలుగు సినిమా ఇదే అయ్యే అవకాశం ఉందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. దీని బట్టి చూస్తుంటే ఈయన నెక్స్ట్ సినిమాలన్నీ పాన్ ఇండియావో, పాన్ వరల్డ్ చిత్రాలు చేస్తాడేమోన‌ని తెలుస్తుంది. స్ట్రైట్ తెలుగు చిత్రాలు ఇక చేయ‌డ‌ని అర్ధం అవుతుంది.గుంటూరు కారం త‌న చివరి తెలుగు సినిమా అయ్యే అవకాశం ఉన్నందునే.. ముందు నుంచి రెండు మాస్ సాంగ్స్ లో ఫుల్ గా డ్యాన్స్ చేయాలని అనుకున్నాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అలాగే భావించారు.

అందుకే కుర్చి మడతపెట్టి పాటతో మరో పాటలోనూ డ్యాన్స్ ఇరగదీశాన‌ని మ‌హేష్ అన్నారు. సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. నెక్లీస్ గొలుసు సాంగ్ చేద్దామని ముందే ఫిక్స్ అయ్యాను. దానికి తగ్గట్టు ముందు ఓ రెండు సాంగ్స్ పెట్టి డిజైన్ చేశాము. మొదట్లో చేసేద్దాం ఏముంది అనుకున్నాను. కానీ షూటింగ్ టైంకి ఈ అమ్మాయితో ఎలా చేయాలని కొంచెం టెన్షన్ పడ్డాను అంటూ మ‌హేష్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. మొత్తానికి శ్రీలీల‌, మ‌హేష్ బాబు పోటాపోటీగా డ్యాన్స్‌లు చేసి దుమ్ములేపేశారు.