Chahal-Dhanashree Divorced: విడాకులు తీసుకున్న.. క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ! భరణం ఎన్ని కోట్లంటే?
అవును..వారిద్ధరు విడిపోయారు. టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) చట్టబద్ధంగా విడిపోయారు.

Chahal-Dhanashree Verma divorced:
అవును..వారిద్ధరు విడిపోయారు. టీమిండియా క్రికెటర్.. స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) జంట చట్టబద్ధంగా విడిపోయారు. ముంబయిలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా వెల్లడించారు. విడాకుల పిటిషన్ విచారణ కోసం చాహల్, ధన శ్రీ ఇవాళ మధ్యాహ్నం కోర్టుకు వచ్చారు.
పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నందున ఆరు నెలల తప్పనిసరి విరామ (కూలింగ్ ఆఫ్ పీరియడ్) గడువును బాంబే హైకోర్టు రద్దుచేసింది. మార్చి 20లోగా విడాకుల పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు విడాకులు మంజూరు చేసింది. ధనశ్రీకి భరణం కింద రూ.4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్లు సమాచారం. ఆ మొత్తంలో ఇప్పటివరకు రూ.2.37 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది.
చాహల్, ధన శ్రీల వివాహం 2020లో డిసెంబర్ 22న జరిగిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వీరిద్దరూ కొంత కాలంగా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుంచి ‘చాహల్’ పదాన్ని తొలగించడంతో వీరు విడిపోతున్నారని వార్తలొచ్చాయి. 2022 నుంచే ఈ ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో 2025 ఫిబ్రవరి 5న ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఇద్దరూ దరఖాస్తు చేసుకున్నారు. విడాకులు మంజూరు చేస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వారివ వైవాహిక బంధానికి శాశ్వతంగా తెరపడింది.
కాగా, ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం చాహల్ మళ్లీ ఆర్జే.మహ్‌వశ్ తో ప్రేమలో పడ్డట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, రేడియో జాకీ ఆర్జే.మహ్‌వశ్‌తో కలిసి చాహల్ రీసెంట్‌గా దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో కనిపించాడు. చాహల్ తో సెల్ఫీ వీడియో, ఫొటోలను ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో వారి మధ్య ప్రేమ బంధం ప్రచారానికి బలం చేకూరింది.
ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచే కాకుండా పలు ఈవెంట్స్‌లో కూడా వారిద్దరూ సందడి చేశారు. దీంతో చాహల్ మహ్‌వశ్‌తో ప్రేమలో పడ్డట్లు టాక్ నడుస్తుంది. కాగా ధనశ్రీ, చాహల్ విడాకుల సందర్భంగా జాకీ మహ్‌వశ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ‘అబద్ధాలు, దురాశ, మోసానికి దూరంగా ఉంచిన దేవుడికి ధన్యవాదాలు.. ఇవాళ అద్దం ముందు ధైర్యంగా నిల్చోగలుగుతున్నా’ అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌కు లవ్ సింబల్స్‌తో ఉన్న డ్రెస్‌తో దిగిన కొన్ని ఫొటోలను పంచుకున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది