King Cobra | కింగ్ కోబ్రా మాట్లాడుతుందా..!

ఓ కింగ్ కోబ్రా దవడలను కదిలిస్తూ మాట్లాడినట్లుగా వీడియో వైరల్ అవుతుంది. ఆ కోబ్రా అలా ఎందుకు చేసిందన్నది ఆసక్తి కరంగా మారింది.

King Cobra | కింగ్ కోబ్రా మాట్లాడుతుందా..!

విధాత : కింగ్ కోబ్రా పాము జాతుల్లో అత్యంత ప్రమాదకరమైన విష నాగు. 20అడుగులకు పైగా పొడవు పెరిగే కింగ్ కోబ్రాలు(King Cobra) బుసలు కొడుతూ మీదకు వస్తుండటం చూస్తేనే గుండె జారిపోతుంది. కోబ్రా బుసబుసల శబ్ధాలు వింటే భయంతో సగం చచ్చిపోతుంటారు. అయితే కోబ్రాలు కూడా మాట్లాడుతాయా అంటే బుస బుసల శబ్ధాలు…కాటు వేసేందుకు నోరు తెరవడాలు తప్ప అవి మాట్లాడవన్న సంగతి తెలిసిందే. అయితే ఓ కోబ్రా మాత్రం తనేదో మాట్లాడుతున్నట్లుగా…లేక ప్రత్యర్థిని వెక్కిరించినట్లుగా తన నోటిని, దవడలను కదలించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇదేందీ…పాములు ఇలా కూడా వ్యవహరిస్తాయా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఓ ఇంటి ఆవరణలో ఎండు కట్టెలు పేర్చిన చోటుకి వచ్చిన ఓ కింగ్ కోబ్రా(King Cobra) ఎదురుగా వున్న వ్యక్తిని చూసి నోటిని, దవడలను విచిత్రంగా కదిలించింది. దాని తీరు చూస్తే అదేదో మాట్లాడినట్లుగా అనిపించింది. అయితే వాస్తవానికి కింగ్ కోబ్రా తనకు దొరికిన ఆహారం( క్రిమికీటకాలు)ను తినేసి..తిరిగి తన దవడలను సరిచేసుకునే క్రమంలో అలా దవడలను ఆడించిందని నిపుణులు చెబుతున్నారు. పాములు ఆహారం తీసుకునే ప్రక్రియలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడం ఈ రకమైన పద్దతులు అనుసరిస్తాయంటున్నారు.