Rangleela Turns 30 : ‘రంగీలా’ సినిమాకు 30ఏళ్లు..ఊర్మిళ డ్యాన్స్ వీడియో వైరల్!
‘రంగీలా’ 30 ఏళ్లు! ఊర్మిళ స్టెప్పులేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, నెటిజన్లను మళ్లీ ఉర్రూతలూగించింది.

విధాత : రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) దర్శకత్వంలో ఊర్మిళ మంటోడ్కర్(Urmila Matondkar) నటించిన ‘రంగీలా’ సినిమా సినీ పరిశ్రమల్లోని చెప్పుకోదగ్గ చిత్రాల్లో ఒకటిగా గుర్తింపుపొందింది. ఊర్మిళ-ఆమిర్ ఖాన్(Aamir Khan) జంటగా నటించిన ‘రంగీలా’ ఓ క్లాసిక్ హిట్ గా నిలిచింది. సంగీతం ఏఆర్ రెహమాన్ అందించారు. సినిమాలోని ప్రతిపాట..సన్నివేశాన్ని రాంగోపాల్ వర్మ తనదైన శైలీలో అద్భుతంగా తీశారు. ముఖ్యంగా ఊర్మిళ గ్లామర్, డ్యాన్స్‌లు అప్పట్లో యువతను ఉర్రూతలూగించగా…ఆమె కెరీర్ కు రంగీలా సినిమా మైల్ స్టోన్ గా నిలిచింది.1995లో వచ్చిన‘రంగీలా’(Rangleela)సినిమా కు 30ఏళ్లు నిండాయంటూ నటి ఊర్మిళ..తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘రంగీలా రే’(Rangleela Re) పాటకు స్టెప్పులేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాల్ వైరల్ కావడంతో మరోసారి ఆనాటి క్లాసిక్ ‘రంగీలా’ సినిమా ప్రేక్షకుల మదిలో మరోసారి తచ్చాడింది. వీడియోలో తన పాటకు డ్యాన్స్ చేసిన ఊర్మిళ ఇన్నాళ్ల తర్వాత కూడా తనలోని గ్లామర్..ఎనర్జీ ఏమాత్రం తగ్గలేదన్నట్లుగా ఆనాటి రంగీలా సినిమాలోని ఊర్మిళను గుర్తు చేసేలా ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేయడం పట్ల నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఇప్పటికి కళ్ల ముందు రంగీలా జ్ఞాపకాలు
ఈ వీడియోతో పాటు ఊర్మిళ తన రంగీలా(Rangleela) సినిమాపై తన అభిప్రాయాలను కూడా పోస్ట్ చేశారు. “రంగీలా నా జీవితంలో ఒక సాధారణ సినిమా కాదు, అది ఒక గొప్ప నవరసాల అనుభూతి. ప్రతి సన్నివేశం, ప్రతి పాట నాకు ప్రత్యేకమైన గుర్తుగా ఉంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృదయంలో ఒక స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గుర్తొస్తే, ఆ మధురమైన క్షణాలన్నీ మళ్లీ కన్నుల ముందు కదలుతున్నట్లుందని రాసుకొచ్చింది. ప్రేక్షకుల ప్రేమకు, ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు అని.. నన్ను ఈ స్థాయికి తీసుకురావడంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని పేర్కొంది. మీరు చూపిన ప్రేమే నాకు పెద్ద ఆశీర్వాదం అని తెలిపింది. ప్రస్తుతం ఊర్మిళ పోస్టు వైరల్ గా మారడంతో మరోసారి ప్రేక్షకులు ఫోకస్ రంగీలా మూవీపై పడింది.
View this post on Instagram