జగన్ వీడియోని షేర్ చేసిన నమ్రత.. ఏం జరుగుతుందో తెలియక ఫ్యాన్స్ షాక్

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్‌గా సత్తా చాటిన నమ్రత.. మహేష్‌ని పెళ్లాడిన తర్వాత సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీకే పూర్తి సమయం కేటాయిస్తుంది. ప్రస్తుతం మహేష్‌కి సంబంధించిన అన్ని వ్యవహారాలని చూసుకుంటుంది. అయితే రీసెంట్‌గా మహేష్ నటించిన గుంటూరు కారం చిత్రం విడుదల కాగా, ఈ చిత్రం ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. కాకపోతే మహేష్ ఫ్యాన్స్‌కి మాత్రం మూవీ ఫీస్ట్ అంటున్నారు. అయితే గుంటూరు కారం మూవీ రిలీజ్ తర్వాత నమ్రత తన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరచింది.
తన ఇన్‌స్టా స్టోరీలో మహేశ్ బాబు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంబంధించిన మూచ్యువల్ వీడియోను షేర్ చేసింది. దానికి ‘గుంటూరు కారం’లోని ‘దమ్ మసాలా’ సాంగ్ జత చేసి ఉంది. ఇది చూసి మహేష్ ఫ్యామిలీ.. జగన్‌కి పూర్తి సపోర్ట్ ఇస్తున్నట్టుగా ఉందిగా అంటూ కొందరు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో జగన్‌కే మా మద్దతు అన్నట్టుగా నమ్రత ఇలా హింట్ ఇచ్చిందా అని పలువురు ముచ్చటించుకుంటున్నారు. 45 నిమిషాల వరకు ఆ పోస్ట్ ను ఉంచి డిలీట్ చేయడం కొసమెరుపు. మరి నమ్రత ఇలా ఎందుకు చేసింది అనే దానిపై త్వరలో అయిన క్లారిటీ ఇస్తుందా అనేది చూడాలి.
ఇక ఇదిలా ఉంటే ‘గుంటూరు కారం’ సినిమాను ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. మహేశ్ బాబు మాస్ ట్రీట్ తో పాటు, శ్రీలీలా దుమ్ములేపే పెర్ఫామెన్స్, థమన్ మ్యూజిక్ కు థియేటర్లలో రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో నిర్వహించగా, ఆ సమయంలో మహేష్‌బాబు ఫ్యాన్స్‌నుద్దేశించి చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మహేష్ మాటల్లో.. మీరెప్పుడూ నాగుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాన్నగారికి, నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ పండుగ సీజన్‌లో మా సినిమా రీలిజయితే అది హిట్టే. ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నా. కానీ, ఇప్పడు నాన్న మనతో లేరు. ఇకనుంచి మీరే నాకు అమ్మ, నానన్న అంటూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు.