Site icon vidhaatha

అంద‌రి ముందు క‌న్నీళ్లు పెట్టుకున్న సోహైల్‌.. స్నేహితుడి కోసం మందు పంచిన అవినాష్‌

బిగ్ బాస్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కంటెస్టెంట్ సోహైల్‌. ఈ షో వ‌ల‌న వచ్చిన క్రేజ్‌తో సినిమాల‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వ‌రుస సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. రీసెంట్‌గా ‘బూట్ కట్ బాలరాజు’ చిత్రంతో థియేట‌ర్‌లోకి వ‌చ్చాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న‌ థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ఈ సినిమా చూడ్డానికి జనం థియేటర్స్‌కి రాకపోవడంతో అంద‌రి ముందు క‌న్నీరు పెట్టుకున్నాడు సోహైల్‌. చాలా చోట్ల షోలు క్యాన్సిల్ కావ‌డం, థియేట‌ర్స్‌కి జ‌నాలు రాక‌పోవ‌డంతో మ‌నోడు ఎమోష‌న‌ల్ అయ్యాడు. ‘కంటెంట్ ఉన్న చిత్రాలను ఆదరిస్తామని అంటారు కదా.. అసలు సినిమా చూడకుండా కంటెంట్ ఉందో లేదో ఎలా తెలుస్తుందని వాపోయిన సోహైల్.. సినిమా చూస్తూ థియేటర్ నుంచే రివ్యూ రాస్తున్న ఓ ప్రబుద్ధుడి వీడియోను మీడియాకి చూపిస్తూ భోరున ఏడ్చాడు సోహైల్.

‘‘సినిమా అనేది ఫ్రెండ్స్‌తో మాత్రమే చూసేది కాదు.. ఫ్యామిలీస్‌తో చూసేది. అలాంటి సినిమానే ‘బూట్ కట్ బాలరాజు’. మా సినిమాలో ఎలాంటి వల్గారిటీ లేదు. ప్లీజ్.. మీ అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా. నా సినిమా రెండు రాష్ట్రాల్లోనూ చాలా చోట్లు థియేటర్స్‌లో వేశారు. కొన్నిచోట్ల షోస్ పడలేదు. చాలా బాధగా ఉంది. హైదరాబాద్‌లో మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంది. కానీ మిగిలిన చోట్ల మాత్రం థియేటర్స్‌కి వెళ్లడం లేదు. కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తాం అని అంటారు కదా.. మాది కంటెంట్ ఉన్న సినిమా. కనీసం ఓ ముప్పై మంది వెళ్లండి.. ఓ నలభై మంది వెళ్లండి థియేటర్స్‌కి. కానీ ఎవరూ వెళ్లడం లేదు. వెళ్లి చూస్తేనే కదా కంటెంట్ ఉందో లేదో తెలుస్తుంది. సినిమా ఓ వైపు న‌డుస్తుంటే ఓ వ్యక్తి.. 20 నిమిషాలు సినిమా కంప్లీట్ కాకుండానే రివ్యూ టైప్ చేసేస్తున్నాడు ఫోన్‌లో. దయచేసి నా బాధను అర్ధం చేసుకోండి. నా బాధని చెప్పుకుంటున్నా. మీకు దండం పెట్టి అడుగుతున్నా.. థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి అంటూ భోరున ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు సోహైల్.

అయితే సోహైల్ మూవీ ప్ర‌మోష‌న్స్‌కి ఆయ‌న స్నేహితులు చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. ముక్కు అవినాష్ అయితే వైన్ షాప్‌కి వెళ్లి అక్క‌డ‌కి వచ్చిన మందు బాబుల్ని ఖుషీ చేస్తూ.. వాళ్లందరికీ 90 బాటిల్స్ పంచిపెట్టాడు. క్కడికి వచ్చిన మందుల్ని ‘బూట్ కట్ బాలరాజు’ సినిమా చూడాలని కోరాడు అవినాష్. ఆ తరువాత బైక్‌పై రోడ్లపై వెళ్తూ.. వాహనదారుల్ని పలకరిస్తూ.. బూట్ కట్ బాలరాజు సినిమా ప్రమోషన్స్‌ని నిర్వహించాడు ముక్కు అవినాష్. బూట్ క‌ట్ బాల‌రాజు చిత్రానికి సోహైల్ నిర్మాత‌గా కూడా వ్య‌వ‌హ‌రించ‌గా ఈ చిత్రంలో మేఘ లేఖ, సునీల్, సిరి హన్మంత్, ఇంద్రజ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.

Exit mobile version