Sonia Gandhi| ఖమేనీ మరణంపై మోదీ ప్రభుత్వం మౌనం ఆక్షేపణీయం : సోనియాగాంధీ

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఇరాన్ పై భారత ప్రభుత్వం వహించిన మౌనంపై పార్లమెంటులో చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ : ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వహించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. ఓ జాతీయ ఆంగ్ల దిన పత్రికకు రాసిన వ్యాసంలో సోనియా గాంధీ ఖ‌మేనీ మృతిపైన..అమెరికా, ఇజ్రాయెల్ లు తమ దాడులతో ఇరాన్ సార్వ‌భౌమ‌త్వాన్ని దెబ్బ తీసేలా చేస్తున్న యుద్దంపైన మోదీ ప్ర‌భుత్వం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డాన్ని సోనియా త‌ప్పుప‌ట్టారు. ఇరాన్ పై భారత ప్రభుత్వం వహించిన మౌనంపై పార్లమెంటులో చర్చ జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇరాన్ అంశంలో భార‌త్ ప్ర‌ద‌ర్శించిన మౌనం త‌ట‌స్థంగా ఉండ‌డం కాదు అని, అది ఇరాన్ ను ప‌రిత్యాగం చేసిన‌ట్లుగా ఉంద‌ని సోనియా ఆరోపించారు. భార‌తీయ విదేశాంగ విధానంపై విశ్వ‌సం కోల్పోయిన‌ట్లుగా ఉంద‌ని ఆమె విమర్శించారు. విదేశీ విధానం అంశంలో భార‌త్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ఆందోళ‌న‌క‌రంగా ఉన్న‌ట్లు కూడా ఆమె పేర్కొన్నారు. ఇరాన్ మనకు మిత్ర దేశం అని, అనేక అంశాలలో మనకు మద్దతుగా నిలిచిన అంశాన్ని ఈ సందర్భంగా సోనియాగాంధీ గుర్తు చేశారు.

ఒక‌వైపు ఇరాన్ తో చ‌ర్చ‌లు నిర్వ‌హిస్తూనే మ‌రో వైపు ఆ దేశ అధినేతను చంప‌డం అంత‌ర్జాతీయ చ‌ట్టాల‌ను ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌న్నారు. ఇలాంటి షాకింగ్ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు భార‌త్ వ్య‌వ‌హ‌రించిన తీరు మ‌రింత షాకింగ్‌గా ఉంద‌ని సోనియాగాంధీ అభిప్రాయపడ్డారు. ఖ‌మేనీ హ‌త్య గురించి కానీ, అంశం గురించి కానీ భార‌త ప్ర‌భుత్వం ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డాన్ని సోనియా ఖండించారు.

అయితే ఇరాన్ అంశంపై సోనియాగాంధీ ప్రకటనను బీజేపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న హింసపై ఇప్పటివరకు ఒక్క మాట కూడా మాట్లాడని సోనియాగాంధీ.. ఖమేనీ మరణాన్ని ఖండించాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందంటూ విమర్శిస్తున్నారు. ఇది కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Latest News