Paytm-Fastag | పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు అలెర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల పేటీఎం పేమెంట్స్‌బ్యాంక్‌పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ ఆంక్షలు ఈ నెల 15నుంచి అమలులోకి రానున్నాయి. మార్గదర్శకాల ఉల్లంఘన, నిర్వహణ లోపాల కారణంగా ఆంక్షలు విధించినట్లు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. గడువు తర్వాత కొత్త డిపాజిట్లు సేకరించడం, టాప్ అప్స్‌ను ఫిబ్రవరి 29 తర్వాత స్వీకరించొద్దని ఆదేశించింది. అయితే, ఆ గడువును మార్చి 15 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం ఫాస్టాగ్ సేవలను నిలిపివేసింది. ఫాస్టాగ్ అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను ఎన్‌హెచ్‌ఐఏ తొలగించింది. ప్రస్తుతం పేటీఎం ఫాస్టాగ్ వినియోగిస్తున్న వారంతా మరో బ్యాంకు ఫాస్టాగ్ కోసం బదిలీ కావాల్సి చేసుకోవాల్సి ఉంటుంది. పేటీఎం ఫాస్టాగ్‌లో డబ్బులు జమ చేయలేరు. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ ఎలక్ట్రానిక్ టోలింగ్ విభాగమైన ఇండియన్ హైవే మేనేజ్‌మెంట్ కంపెనీ (IHMCL) తన అధికారిక ప్రకటనలో ఫాస్టాగ్‌తో ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు 32 అధీకృత బ్యాంకుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నుంచి ఫాస్టాగ్‌ను తీసుకోవాలని సూచించింది.
ఫాస్టాగ్ అధికృత బ్యాంకుల జాబితా.. లింక్స్ ఇవే..
ఫాస్టాగ్ కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 32 బ్యాంకుల అధీకృత జాబితాను విడుదల చేసింది. ఇందులో కొత్తగా ఫాస్టాగ్ అకౌంట్‌ను తీసుకోవచ్చు. ఇందు కోసం వాహనం నంబరు, మొబైల్ నంబర్, వాహనం ఆర్సీ ఫొటోలను అటాచ్ చేసి ఫాస్టాగ్‌ను తీసుకునేందుకు వీలుంది. కింద లింక్స్‌ను క్లిక్ చేసి మీకు నచ్చిన బ్యాంకులో ఫాస్టాగ్ అకౌంట్‌ను తీసుకోవచ్చు. అధీకృత జాబితాలో ఏయిర్ టెల్‌పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌తో పాటు 32 బ్యాంకులున్నాయి.
ఎయిర్ పేమెంట్స్ బ్యాంక్ : https://www.airtel.in/bank/fastag-pay-toll-online/buy
ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : https://www.aubank.in/personal-banking/digital-banking/payment/fastag
యాక్సిస్ బ్యాంక్ : https://fastag.axisbank.co.in/CEBAWEB/Default.aspx
అలహాబాద్ బ్యాంక్ : https://fastagpro.com/allahada-bank-fastag-recharge
బ్యాంక్ ఆఫ్ బరోడా : https://fastag.bankofbaroda.com/Pages/CreateAccount/CreateAccount.aspx
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : https://www.bankofmaharashtra.in/netc-fastag
కెనరా బ్యాంక్ : https://canarites.canarabankdigi.in/Fastag/
సిటీ యూనియన్ బ్యాంక్ : https://www.cityunionbank.com/cub-fastag
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ : https://www.equitasbank.com/fastag
కాస్మోస్ బ్యాంక్ : https://www.cosmosbank.com/product-services-details.aspx?id=19
డీఎన్‌ఎస్ బ్యాంక్ : https://www.dnsbank.in/Encyc/2021/6/7/DNS-Fastag-for-toll-plaza.html
ఫెడరల్ బ్యాంక్ : https://netcfastag.federalbank.co.in/
ఫినో పేమెంట్స్ బ్యాంక్ : https://www.finobank.com/personal/products/fastag/
హెచ్‌డీఎఫ్‌సీ : https://apply.hdfcbank.com/digital/fastag
ఐసీఐసీఐ : https://nli.icicibank.com/NewRetailWeb/fastTagHomePage.htm?channelCode=imb_sales
ఐడీబీఐ : https://www.idbibank.in/fastag.aspx
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ : https://www.idfcbank.com/fastag.html
ఇండస్ ఇండ్ బ్యాంక్ : https://fastag.indusind.com/Account/CreateNewUser?NeutralTag=0#cbs_step-1
ఇండియన్ బ్యాంక్ : https://www. indianbank.in/departments/netc-fastag/
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ : https://iobfastag.gitechnology.in/
జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్ : https://www.jkbank.com/transactions/services/fastag.php
కర్నాటక బ్యాంక్ : https://karnatakabank.com/personl/national-electronic-toll-collection
కేవీబీ : https://www.fastag.kvb.co.in
కొటక్ మహీంద్రా బ్యాంక్ : https://kotakfastag.in/?Source=NPCI
లైవ్‌క్విక్ : https://livquik.com/fastag/
నాగ్‌పూర్ సిటిజన్ కోపరేటివ్ : https://www.nnsbank.co.in/netcfaq.php
పంజాబ్ మహారాష్ట్ర : https://fastagpro.com/punjab-maharashtra-cooperative-bank-fastag-recharge
పీఎన్‌బీ : https://www.pnbindia.in/PNB-Netc.html
సరస్వత్ బ్యాంక్ : https://www.saraswatbank.com/content.aspx?id=National-Electronic-Toll-Collection-NETC
సౌత్ ఇండియన్ బ్యాంక్ : https://fastag.Indiansouthbank.com/NETCPortal/getCustOnboard
ఎస్‌బీఐ : https://fastag.onlinesbi.com/Home
సిండికేట్ : https://fastagpro.com/syndicate-bank-fastag-recharge
జాల్గన్ పీపుల్స్ : https://www.jpcbank.com/netc-fastag
త్రిసూర్ బ్యాంక్ : https://fastag.im/fastag-by-thrissur-district-coop-bank-kerela-bank/
యూకో : https://www.ucobank.com/web/guest/netc-fastag
యూనియన్ బ్యాంక్ : https://www.unionbankofindia.co.in/english/netc-issuer.aspx
ఎస్‌బ్యాంక్ : https://www.yesbank.in/digital-banking/fastag