Site icon vidhaatha

రాజా సాబ్‌గా ప్ర‌భాస్‌.. లుంగీ క‌ట్టులో ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడుగా..!

యంగ్ రెబ‌ల్ స్టార్ ఇటీవ‌ల స‌లార్ చిత్రంతో భారీ హిట్ కొట్టిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన జోష్‌తో మ‌రిన్ని సినిమాలు చేసేందుకు ప్ర‌భాస్ సిద్ధ‌మ‌య్యాడు. ఇప్పుడు ప్ర‌భాస్ ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం కూడా ఒక‌టి. హర్రర్ కామెడీ మూవీగా రాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి ప్ర‌చార చిత్రం బ‌య‌ట‌కి రాలేదు. దీంతో ఫ్యాన్స్ చాలా నిరాశ‌లో ఉండ‌గా, ఎట్ట‌కేల‌కి సంక్రాంతి సంద‌ర్భంగా మాత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ చిత్రానికి ‘ది రాజా సాబ్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసిన‌ట్టు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రివీల్ చేశారు.

పోస్ట‌ర్ లో రెబెల్ స్టార్ ఊరమాస్ లుక్‌తో దర్శనమిచ్చాడు. పైన బ్లాక్ షర్ట్.. కింద పూల లుంగీతో తొలిసారి డిఫరెంట్ గెటప్‌లో కనిపించాడు. దీంతో ‘ది రాజా సాబ్’ పోస్టర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ చూస్తుంటే ఇందులో ఫుల్ మాసీగా, ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తున్నాడు. ఆ లుంగీ కట్టుతో వింటేజ్ ప్రభాస్ గుర్తుకు వస్తున్నాడు. సినిమాకి రాజా సాబ్ అనే టైటిల్ పెడుతున్నారు అంటూ ఆ మధ్య లీక్ అయింది. కానీ అది నిజమై ఉండకపోవచ్చంటూ అంతా అనుకున్నారు. కానీ చివరకు అదే నిజమైంది. రాజా సాబ్ అంటూ పాన్ ఇండియన్‌కు సరిపోయే టైటిల్‌ను పెట్టేశాడు మారుతి.

మూవీని ప్ర‌భాస్ అభిమానులు మెచ్చేలా మారుతి తెర‌కెక్కించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రం థియేటర్లోకి వచ్చే అవకాశం ఉంద‌ని టాక్ న‌డుస్తుంది..భిన్నమైన కాంబినేషన్‌లో రాబోతున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు . పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  

Exit mobile version