Vande Bharat Express | ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం కొత్తగా పది వందే భారత్ రైళ్లలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు. దాంతో వందే భారత్ రైళ్లు 50 దాటనున్నాయి. ప్రస్తుతం భారతీయ రైల్వే 41 సెమీ హైస్పీడ్ రైళ్లను నడుపుతున్నది. 24 రాష్ట్రాలు, 256 జిల్లాల్లో విస్తరించి ఉన్న బ్రాడ్ గేజ్ ఎలక్ట్రిఫైడ్ నెట్‌వర్క్‌తో రాష్ట్రాలను కలుపుతున్నది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ఆరు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఇందులో ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూరు-చెన్నై, కాసరగోడ్-తిరువనంతపురం, విశాఖపట్నం-సికింద్రాబాద్ ఉన్నాయి. వందే భారత్ రైళ్లు ప్రధానంగా వివిధ రాష్ట్రాల్లోని విస్తరించి ఉన్న విద్యుద్దీకరణ బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో పరుగులు తీస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఆరు అదనపు వందేభారత్ రైళ్లను ప్రారంభించారు. ఢిల్లీ-కత్రాను కలిపే రెండవ రైలు కూడా ఇందులో ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో అత్యధికంగా 10 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీని ఇతర రాష్ట్రాలతో కలుపుతున్నది.
ఢిల్లీ ఆ తర్వాత ముంబయిలో ఆరు, చెన్నైలో ఐదు వందే భారత్ రైళ్లు ఉన్నాయి. ఇక మైసూర్‌లో రెండో వందే భారత్ రైలు నేడు ప్రారంభం కాబోతున్నది. ఇక నేడు ప్రధాని పది మార్గాల్లో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఇందులో ముంబయి-అహ్మదాబాద్, సికింద్రాబాద్-విశాఖపట్నం, మైసూరు-చెన్నై, పాట్నా-లక్నో, న్యూ జాల్పాయ్‌గురి-పాట్నా, పూరీ-విశాఖపట్నం, లక్నో-డెహ్రాడూన్, కలబురగి-బెంగళూరు, రాంచీ-వారణాసి, ఖజురాహో-డీఎల్ మధ్య రైళ్లను ప్రారంభించనున్నారు. అహ్మదాబాద్-జామ్‌నగర్ వందే భారత్‌ను ద్వారక వరకు పొడిగించారు. అజ్మీర్-ఢిల్లీ సరాయ్ రోహిల్లా వందే భారత్ చండీగఢ్ వరకు వెళ్లనున్నది. గోరఖ్‌పూర్-లక్నో వందే భారత్‌ను ప్రయాగ్‌రాజ్ వరకు, తిరువనంతపురం-కాసరగోడ్ వందే భారత్‌ను మంగళూరు వరకు పొడిగిస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకున్నది.