పది మందిలో ఒకరు డయాబెటిస్(మధుమేహం)తో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా మధుమేహం అటాక్ చేస్తోంది. దీంతో చాలా మంది చాలా రకాల మెడిసిన్స్ వాడుతున్నారు. తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. అతిగా తినకూడదు. నాన్ వెజ్‌కు కూడా దూరంగా ఉండాలి. తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. అయితే మామిడి ఆకులతో కూడా మధుమేహానికి చెక్ పెట్టొచ్చని చైనీయుల అధ్యయనంలో తేలింది.
మధుమేహాన్ని, ఉబ్బసాన్ని కంట్రోల్ చేయడానికి మామిడి ఆకుల రసం కచ్చితంగా సహాయపడుతుందని చైనీయులు తేల్చారు. మామిడి ఆకుల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే ఇది కేవలం చైనీయుల అధ్యయనమే కాదు.. శాస్త్రీయ పరిశోధన కూడా తేల్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 2010లో నిర్వహించిన ఓ అధ్యయనంలో మామిడి ఆకుల రసంతో గ్లూకోజ్ స్థాయిలో మార్పులను గుర్తించినట్లు తేలింది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయం చేస్తుందని అధ్యయనం నిర్ధారించింది.
అయితే తాజాగా ఉన్న 15 మామిడి ఆకులను తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ ఆకులను 150 మి.లీ. నీటిలో బాగా ఉడకబెట్టాలి. ఆ నీటిని రాత్రంతా వదిలేసి, ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ముందు వడకట్టి ఆ నీటిని తాగాలి. సుమారు మూడు నెలలపాటు ప్రతిరోజూ మామిడి ఆకుల రసాన్ని తాగితే మధుమేహం నుంచి ఉపశమనం పొందొంచ్చని అధ్యయనం తేల్చింది.
మామిడి ఆకుల నుంచి వచ్చిన రసం.. శరీరంలోని ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. దాంతో శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా మామిడి ఆకుల్లో ఉండే పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి వంటి అనేక పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు లేదంటే ఊబకాయంతో ఇబ్బంది పడేవారు కూడా మామిడి ఆకుల రసాన్ని సేవించొచ్చు. రాత్రిళ్లు తరుచుగా మూత్ర విసర్జనకు వెళ్లే వారు కూడా ఈ రసాన్ని తీసుకోవచ్చు. మామిడి ఆకుల రసంలోని యాంటీ ఆక్సిడెంట్లు కంటిచూపును కూడా మెరుగుపరుస్తాయి.