Site icon vidhaatha

Vijayakanth | డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌కు కరోనా..! తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిక..!

Vijayakanth | దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజగం (DMDK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయకాంత్‌కు కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయనను ఆసుప్రతిలో చేరారు. శ్వాస సంబంధిత సమస్యల నేపథ్యంలో ఆయనను వెంటిలెటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డీఎండీకే పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు నవంబర్‌లో శ్వాసకోశ సమస్యలతోనే విజయ్‌కాంత్‌ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ‘ఆయనకు చిన్న మొత్తంలో పల్మనరీ సపోర్ట్‌ అవసరం. కొద్దిరోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన విజయకాంత్‌కు మొదట్లో చాలా మెరుగుదల కనిపించింది. అయితే, గత 24 గంటల్లో పరిస్థితి మళ్లీ దిగజారింది’ అని ఎంఐఓటీ ఇంటర్నేషనల్‌ ఆసుపత్రి బులిటెన్‌లో పేర్కొంది. ఆయన పూర్తిగా కోలుకుంటాడని ఆశిస్తున్నామని.. దాదాపు రెండువారాల వరకు ఆసుపత్రిలోనే ఉండాల్సి ఉంటుందని తెలిపింది. సెప్టెంబర్‌ 2020లో ఆయన కొవిడ్‌ బారినపడ్డారు. ఆ సమయంలో ఆయన చెన్నైలోని మియోట్ ఇంటర్నేషనల్‌లో చికిత్స పొందారు. 2011-16లో తమిళనాడు శాసనసభలో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా కొనసాగారు.

Vijayakanth | డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌కు కరోనా..! తీవ్ర శ్వాసకోశ సమస్యలతో ఆసుపత్రిలో చేరిక..!

ఇదిలా ఉండగా.. డీఎండీకే నేత విజయ్‌కాంత్‌ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన బహిరంగ సభలు, పార్టీ సమావేశాలకు సైతం హాజరుకాలేదు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, గొంతు నొప్పితో ఆయన పరీక్షల కోసం చెన్నైలోని ఆసుపత్రికి వెళ్లారు. జలుబు , దగ్గు ఎక్కువగా ఉండడంతో పరీక్షించిన వైద్యులు కృత్రిమ శ్వాస అందించారు. ఆయన ఆర్యోగ పరిస్థితి క్షీణించిందని పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని.. ఆయన ఆర్యోగం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే, నవంబర్‌ 23న విజయ్‌ కాంత్‌ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. వైద్యానికి సహకరిస్తున్నట్లుగా ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది. దాదాపు నెల రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్న ఆయన కోలుకోవడంతో డిసెంబర్‌ 11న డిశ్చార్జి చేశారు. ఆ తర్వాత పార్టీ వర్కింగ్‌ కమిటీ సాధారణ సమావేశాలకు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఆయనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలినట్లు పేర్కొంది. ఈ మేరకు డీఎండీకే పార్టీ ప్రకటన విడుదల చేసింది.

Exit mobile version