Credit Card | క్రెడిట్‌కార్డు ఉందా..? మరి ‘మినిమమ్‌ అమౌంట్‌ డ్యూ’ గురించి మీకు తెలుసా..?

  • Publish Date - April 7, 2024 / 10:40 AM IST

Credit Card | ప్రస్తుత కాలంలో క్రెడిట్‌కార్డుల వినియోగం చాలానే పెరిగింది. బ్యాంకులు సైతం విరివిరిగా కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే, చాలామందికి ఈ క్రికెట్‌కార్డులను ఎలా వాడాలో తెలియడం లేదు. ఫలితంగా ఎక్కువ వడ్డీలను చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులపాలవుతున్నారు. అయితే, చాలామందికి క్రెడిట్‌కార్డు బిల్లుల ‘మినిమమ్‌ అమౌంట్‌ డ్యూ’ గురించి తెలిసే ఉంటుంది. అయితే, కేవలం మినిమమ్‌ డ్యూ గురించి తెలుసుకుందాం రండి..!

క్రెడిట్​ కార్డు బిల్లులో ‘మినిమమ్​ అమౌంట్​ డ్యూ’ గురించి క్రెడిట్‌కార్డు ఉన్న అందరికీ తెలిసిందే. అయితే, పూర్తిగా బిల్లు కాకుండా మినిమమ్‌ అమౌంట్‌ని మాత్రమే చెల్లిస్తే ఏమవుతుందో తెలుసుకునే ముందు.. మొదట క్రెడిట్‌కార్డు పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. అవసరాల కోసం చాలామంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునే విషయం తెలిసిందే. ఈ క్రికెట్‌కార్డు సైతం ఆ కోవకే వస్తుంది. కార్డును వినియోగించిన తర్వాత బిల్లు వస్తుంది. అది అప్పులాంటిదే. ఆ టైమ్‌ పీరియడ్‌లో బిల్లు చెల్లించాల్సిందే. లేకపోతే వాడుకున్న సొత్తుపై వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. బిల్లు తేదీ సమయానికి బిల్లులో కట్టాల్సిన మినిమమ్‌ అమౌంట్‌ని.. మినిమమ్‌ డ్యూగా పిలుస్తారు.

క్రెడిట్‌ కార్డు సేవల కోసం.. మినిమమ్‌ బిల్లును చెల్లించాల్సిందే. అవుట్‌ ​స్టాండింగ్​ క్రెడిట్​ కార్డు బిల్లు పేమెంట్​ అమౌంట్​లో ఈ మినిమిమ్​ డ్యూ.. 5శాతం నుంచి 10శాతం మధ్యలో వస్తుంది. ఉదాహారణకు.. మీ క్రెడిట్‌ కార్డ్‌ అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌ రూ.20వేలు ఉంది అనుకుంటే.. దానికి మీకు 5శాతం మినిమమ్‌ డ్యూ పర్సంటేజ్‌ పడితే.. మీరు కట్టాల్సిన మినిమమ్‌ బిల్లు రూ.1000 అవుతుంది. క్రెడిట్​ కార్డు బిల్లులో మినిమమ్​ అమౌంట్​ని మాత్రమే చెల్లిస్తే.. మిగతా బ్యాలెన్స్‌ అంతా వచ్చే బిల్లింగ్‌ సైకిల్‌లోకి ఫార్వర్డ్‌ అవుతుంది. దీనిపై మళ్లీ వడ్డీపడుతుంది. వడ్డీకి తోడు తదుపరి బిల్లింగ్​ సైకిల్​లో తీసుకునే అప్పుపై సైతం వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. క్రెడిట్​ కార్డు బిల్లులను సక్రమంగా నియంత్రించలేకపోతే ఆర్థికంగా భారంపడుతుంది. సాధారణ రుణం కన్నా క్రెడిట్‌ కార్డులపై వడ్డీలు భారీగా ఉంటాయి. సమయానికి బిల్లు కట్టి వడ్డీ భారం నుంచి తప్పించుకోవచ్చు.

క్రెడిట్‌కార్డు మినిమమ్‌ డ్యూ అమౌంట్‌ గురించి మొదట అర్థం చేసుకోవాలంటే.. పూర్తిగా బిల్లింగ్‌ సైకిల్‌ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బిల్లింగ్‌ సైకిల్‌ 30 రోజుల పాటు ఉంటుంది. ఈ సమయంలో క్రెడిట్‌కార్డు ద్వారా జరిపిన లావాదేవీలన్నీ బిల్లులో రికార్డవుతాయి. సైకిల్‌ చివరలో స్టేట్‌మెంట్‌ జనరేట్‌ అవుతుంది. ఈ బిల్లులోనే అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌, కొత్త ఛార్జీలు, మినమమ్‌ అమౌంట్‌ డ్యూ, బిల్లు చెల్లించాల్సిన తేదీ వివరాలన్నీ అందులో ఉంటాయి. బిల్లు జనరేట్‌ అయ్యాక బిల్లు కట్టేందుకు సాధారణంగా 15-20 రోజుల వరకు సమయం ఉంటుంది. ఈ లోగా బిల్లు చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులుండవు. పేమెంట్​ రిమైండర్స్​, ఆటోమెటిక్​ పేమెంట్స్​, ఈసీఎస్​ సదుపాయం, స్పెండింగ్స్​ని మానిటరింగ్‌తో లేట్‌ పేమెంట్‌ ఫీజు భారం నుంచి తప్పించుకునేందుకు ఛాన్స్‌ ఉంటుంది. ఎప్పుడైనా మినిమమ్‌ డ్యూ అమౌంట్‌ చెల్లించకుండా.. పూర్తి స్థాయిలో బిల్లు చెల్లించి.. ఆ తర్వాత కార్డు సేవలను వినియోగించుకుంటేనే మంచిదని ఆర్థికరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

Latest News