Gold Rate Hike | వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరిగాయి. ఇటీవల తగ్గినట్లే తగ్గిన ధరలు మరోసారి మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే పసిడి ధరలు రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ధరలు పెరుగుతుండడంతో కొనుగోలుదారులు షాక్‌కు గురవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఇంతకుముందు గోల్డ్ ఔన్స్ ధర 2667 డాలర్లు ఉండగా.. గురువారం వరకు 12 డాలర్లు పెరిగి 2,679 డాలర్లకు చేరుకుంది. ఇక సిల్వర్ ఔన్స్ ధర 31.60 డాలర్లకు పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.200 పెరిగి.. తులానికి రూ.71,600 పలుకుతున్నది. ఇక 24 క్యారెట్ల పసిడిపై రూ.220 పెరగడంతో తులం రేటు రూ.78,110 ఎగిసింది.
ఇక వెండి ధర నిలకడగా కొనసాగుతున్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.71,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.78,110కి పెరిగింది. ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.71,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.78,260కి ఎగిసింది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రూ.71,600 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.78,110 పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రూ.71,600 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.78,110కి చేరింది. ఇక ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ సహా పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.97వేల వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో రూ.1,03,000 పలుకుతున్నది. బంగారం ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో పన్నుల మార్పుల కారణంగా ధరలు మారుతూ వస్తుంటాయి.