Site icon vidhaatha

AAMANi|ఆమ‌ని త‌న భ‌ర్త నుండి విడిపోవ‌డం వెన‌క అస‌లు కార‌ణం ఇదే..ఇన్నాళ్ల‌కి భ‌య‌ట‌పెట్టిందిగా..!

AAMANi| న‌టి ఆమ‌ని ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేయ‌డం మ‌నం చూశాం. తెలుగులో ఆమెకి మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంత‌గానో అల‌రించింది ఆమ‌ని. ‘శుభలగ్నం’, ‘మావిచిగురు’ లాంటి సినిమాలు ఆమనిని తెలుగు ప్రేక్షకులకు బాగా ద‌గ్గ‌ర చేశాయి . ఇక ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ‘జంబ లకిడి పంబ’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమని.. ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకుంది లేదు. ఏడాదికి ఎనిమిది నుండి 12 సినిమాలు చేసింది. రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి నటించిన ‘మిస్టర్ పెళ్ళాం’ సినిమాలో అత్యుత్త‌మ ప‌ర్‌ఫార్మెన్స్ ఇచ్చినందుకు ఉత్తమ నటిగా నంది అవార్డు కూడా అందుకున్నారు.

అయితే ఆమ‌ని ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లోను స‌త్తా చాటుతుంది. ప‌లు సినిమాల‌లో క్యారెక్ట‌ర్‌గా క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది. అలానే ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తూ హాట్ టాపిక్ అవుతుంది. ఆమ‌ని ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి చాలా మందికి పెద్ద‌గా తెలియ‌దు. ఆమె తమిళ సినీ నిర్మాత ఖాజా మొహియుద్దీన్ ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే తాను సినిమాల‌లో న‌టించడం భ‌ర్త‌కి ఇష్టం లేక‌పోవ‌డంతో సినిమాలు మానేసి ఇంటి ద‌గ్గ‌రే ఉండేది. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. అయితే వారి విడాకుల‌కి కార‌ణం ఏంట‌నేది ఇన్నాళ్లు అంత‌గా ఎవ‌రికి తెలియ‌దు.

తాజాగా ఆమ‌ని దానిపై వివ‌ర‌ణ ఇచ్చింది. తనకు సినిమాలంటే ఇష్టమని, ఆయన వ్యాపారాల్లో బిజీగా ఉన్నారని… అందుకే విడిపోవాలనుకున్నామని ఆమని చెప్పుకొచ్చారు. విడాకులు తీసుకోకపోయినా… ఒక అండర్ స్టాండింగ్ తో విడిపోయామని, ఇద్ద‌రం ఇప్ప‌టికీ ట‌చ్‌లో ఉన్నామ‌ని, అప్పుడ‌ప్పుడు క‌లుస్తుంటామ‌ని ఆమ‌ని పేర్కొంది. ఇక పిల్లలు మాత్రం తన వద్దే ఉంటారని… వాళ్లే తన ప్రపంచం అని అన్నారు. సినిమాలు, షూటింగ్ ల వల్ల పిల్లలకు కాస్త దూరంగా ఉండాల్సి వస్తోందంటూ ఆమ‌ని పేర్కొంది. భర్త అప్పులపాటు కావడంతో సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించిన‌ట్టు ప్ర‌చారాలు సాగ‌గా, అవన్నీ నిజం కాదంటూ ఆయ‌ని తెలియ‌జేసింది.

Exit mobile version