Abhishek bacchan|ఇటీవలి కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా ఊహించని విధంగా విడిపోతున్నారు.ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ విడాకుల వార్త కొన్నాళ్లుగా దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది. వీరిద్దరి డైవోర్స్ విషయంలో రోజుకో విషయం వెలుగులోకి వస్తున్నది. అయితే వీరి మధ్య నెలకొన్న దాంపత్య వివాదంలో అసలు విషయం ఏమిటో క్లారిటీ లేకపోవడం గందరగోళంగా మారింది. వీరి విడాకులకి అనేక కారణాలు చెబుతూ వస్తున్నారు. సవ్యంగా సాగుతున్న అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య దాంపత్య జీవితంలో కలతలకు అత్త జయబాదురి, మరదలు నవ్య నందా కారణమనే అంశం అని కొన్ని వెబ్ సైట్స్ ప్రచురించాయి.
మరికొందరు ఐశ్వర్యరాయ్.. ఓ డాక్టర్‌తో రిలేషన్ షిప్ పెట్టుకుందని అందుకే అభిషేక్ బచ్చన్ విడాకులు ఇచ్చాడని రాసారు. అనంత్ అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఐశ్వర్యరాయ్ భర్తతో కాకుండా రేఖా తో కలిసి ఫోటోలు దిగడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఇలా రోజుకొక వార్త వినిపించడంతో అందరూ వీరిద్దరూ విడిపోతున్నారు అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అభిషేక్ కి .. ఐశ్వర్యతో 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో మీ అందమైన ప్రయాణం ఎలా అనిపించింది..? అని ప్రశ్నించగా.. దానికి అభిషేక్ మాట్లాడుతూ.. నా భార్య అసాధారణమైనది. ఆమె నాకు ఎప్పటికీ మద్దతుదారుగా నిలుస్తుంది అని తెలిపాడు.
ముఖ్యంగా సినీ పరిశ్రమ నుండి భాగస్వామిని కలిగి ఉండడం ఎంత గొప్ప ప్రయోజనమో అనేది అర్ధమైంది. ఐశ్వర్య నాకంటే ఎక్కువ కాలం నటనా రంగంలోనే ఉంది. కాబట్టి తాను ప్రతీదీ కూడా అర్థం చేసుకుంటుంది. అంటూ భార్య గురించి గొప్పగా చెప్పుకొచ్చారు. అంతేకాదు తన భార్య నెగిటివ్ కామెంట్స్ ని ఏ రోజు కూడా తీసుకోదని, తనపై ఎవరైనా కామెంట్స్ చేస్తే అసలు ఊరుకోదని కూడా చెప్పుకొచ్చాడు అభిషేక్ బచ్చన్. మొత్తానికి అయితే ఎన్ని రూమర్స్ వినిపించినా.. తాము మాత్రం ఎప్పటికీ కలిసే ఉంటామని గత కొద్ది రోజులుగా నెట్టింట జరుగుతున్న అనేక ప్రచారాలకి శుభం కార్డ్ పలికారు అభిషేక్ బచ్చన్. మరి ఇప్పటికీ రూమర్స్‌కి చెక్ పడుతుందా లేదా అనేది చూడాలి.