Rakul Preet Singh| ఉద్యోగుల‌ని మోసం చేసిన ర‌కుల్‌.. వివాదంలో ఆమె భ‌ర్త‌

Rakul Preet Singh| స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నిర్మాత జాతి భగ్నానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జాకీ భగ్నాని చెందిన పూజ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ 100 మందికి 2 సంవత్సరాల నుంచి జీతం చెల్లించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. తమకు ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించట్లేదని సం

  • Publish Date - June 23, 2024 / 12:28 PM IST

Rakul Preet Singh| స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంది. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ నిర్మాత జాతి భగ్నానిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా జాకీ భగ్నాని చెందిన పూజ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థ 100 మందికి 2 సంవత్సరాల నుంచి జీతం చెల్లించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. తమకు ఇవ్వాల్సిన వేతనాలను చెల్లించట్లేదని సంస్థ సిబ్బంది సోషల్‌ మీడియా వేదికగా ఆరోపణలు చేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వారు తీసిన సినిమాకి బడ్జెట్ ఎక్కువ అయిన కార‌ణంగా వేత‌నం చెల్లించ‌లేక‌పోతున్న‌ట్టు నిర్మాణ సంస్థ పేర్కొంద‌ట‌. ఈ విష‌యాన్ని అందులో ప‌ని చేసే ఓ స‌భ్యురాలు తెలియ‌జేసింది.

తాము క‌ష్ట‌ప‌డి చేసిన ప‌నికి జీతం అడిగిన వారు ఇవ్వ‌క‌పోవ‌డంతో మా పరిస్థితి ద‌య‌నీయంగా మారింద‌ని మొత్తుకుంటున్నారు. డబ్బులు ఇవ్వడం చేతకానప్పుడు సినిమాలు ఎందుకు చేస్తారు ? అన్న రేంజ్ లో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇంకెవరు ఈ నిర్మాణ సంస్థతో పని చేయొద్దు అంటూ, బ్లాక్ లిస్టులో పెట్టాలని పూజ ఎంటర్టైన్మెంట్ కు సంబంధించిన ఒక ఎంప్లాయి త‌న ఆక్రోశం వ్య‌క్తం చేశారు. తను సాధారణంగా ఇలాంటి పోస్టులు చెయ్యను కాక‌పోతే, కష్టపడి సంపాదించిన డబ్బు కోసం ప్రతి రోజు తన టీం పడుతున్న కష్టాన్ని చూసి త‌ప్ప‌క ఇలా స్పందించాల్సి వ‌స్తుంద‌ని ఆయన పేర్కొన్నారు.

1986లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఏ ఏర్పాటు కాగా, కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు ఆ ప్రొడ‌క్ష‌న్ నుండే వ‌చ్చాయి. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ వారికి ఘోర‌మైన న‌ష్టాలు తెచ్చిపెట్టింది. అందుకే సినిమాకి చేసిన వారికి జీతాలు ఇవ్వ‌డం లేద‌ని ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. ప్రొడక్షన్ డిజైన్ వర్కర్ అయిన బాధితురాలు రెండేళ్ల క్రితం దాదాపు 100 మంది సిబ్బందితో కలిసి సినిమాకి ప‌ని చేయ‌గా, వారంతా రెండు నెల‌ల జీతం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. ఇదే సంస్దలో పనిచేసే మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటిం‍గ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని, 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని అన్నాడు. ఆరోపణలపై రకుల్, జాకీ ఎలా స్పంద‌న వ‌స్తుందా అనేది చూడాలి.

Latest News