Site icon vidhaatha

Actor Mohanlal | నటుడు మోహన్ లాల్ కు అస్వస్థత….ఆస్పత్రికి తరలింపు

విధాత, హైదరాబాద్ : ప్రముఖ నటుడు మోహన్ లాల్ అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర జ్వరం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండరాల నొప్పుల కారణంగా నటుడు మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శ్వాసకోశ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు డాక్టర్లు అనుమానిస్తున్నారు. ఐదు రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్‌తో ఆయన ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇండస్ట్రీ ట్రాకర్ శ్రీధర్ పిళ్లై.. తన ఎక్స్ ఖాతా వేదికగా వెల్లడించారు. మరోవైపు మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం బరోజ్. ఈ చిత్రం ఈ ఏడాది ఆక్టోబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మోహన్‌లాల్ ప్రస్తుతం ఎంపురాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి స్వయంగా దర్శకత్వం వహించగా.. బరోసిన్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను పూర్తి చేసి కొచ్చికి తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు జ్వరం వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Exit mobile version