Actor Prithviraj | షాకింగ్..క‌మెడీయ‌న్ పృథ్వీరాజుకి నాన‌బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్

Actor Prithviraj| క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే డైలాగ్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన ఈ క‌మెడీయ‌న్ చాలా మంచి పాత్ర‌లు పోషించి అల‌రించారు. ఒక‌ప్పుడు వ‌రుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ అయిన పృథ్వీ కెరియ‌ర్ డైల‌మాలో ప‌డింది. ఆ మధ్యన ఓ ఆడియో టేప్‌లో ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోవ‌డంతో SVBC ఛైర్మన్ పదవి కూడా పోయింది. ఆ వాయిస్ తనది కాదని ఎంత చెప్పినా కూ

  • Publish Date - June 13, 2024 / 12:28 PM IST

Actor Prithviraj| క‌మెడీయ‌న్ పృథ్వీరాజ్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అనే డైలాగ్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన ఈ క‌మెడీయ‌న్ చాలా మంచి పాత్ర‌లు పోషించి అల‌రించారు. ఒక‌ప్పుడు వ‌రుస ఆఫర్స్‌తో ఫుల్ బిజీ అయిన పృథ్వీ కెరియ‌ర్ డైల‌మాలో ప‌డింది. ఆ మధ్యన ఓ ఆడియో టేప్‌లో ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోవ‌డంతో SVBC ఛైర్మన్ పదవి కూడా పోయింది. ఆ వాయిస్ తనది కాదని ఎంత చెప్పినా కూడా బయట మాత్రం ఆ డైలాగులు బాగా ఫేమస్ అయిపోవ‌డంతో ఆయ‌న‌ని ఓ రేంజ్‌లో ట్రోల్ చేశారు. జబర్దస్త్, అదిరింది లాంటి షోలలో ఆడియో టేపుల‌లో మాట్లాడిన మాట‌ల‌తో కామెడీ పండించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే వైసీపీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక మ‌నోడు జ‌న‌సేన పార్టీలో చేరి వైసీపీ నాయ‌కుల‌ని దారుణంగా తిట్టిపోసారు.

 

ఇక పృథ్వీరాజ్‌కి ఆయన భార్య శ్రీలక్ష్మి తో గత కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. పృథ్వీ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి ప్రతినెలా మనోవర్తి చెల్లించాలంటూ గతంలోనే కోర్టు ఆదేశించినా ఆయ‌న భేఖాతరు చేయడంతో.. ఆమె మళ్లీ కోర్టు తలుపు తట్టింది. కోర్టులో తన భర్త నుంచి తనకు నెలకు రూ. 8 లక్షలు భరణం ఇప్పించాలని కోరింది. అయితే తాజాగా పృథ్వీరాజ్ కు విజయవాడ ఫ్యామిలీ కోర్టు ఊహించని షాక్ ను ఇచ్చింది. కోర్టు ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు రూ.22వేల చొప్పున చెల్లించాలని చెబుతూ బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది.

అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయలేదు. దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు సుంకర రాజేంద్రప్రసాద్‌, సప్పా రమేష్‌, సీహెచ్‌ వడ్డీకాసులును సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. పృథ్వీరాజ్ కోర్టుకు హాజరుకాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరుకావడం లేదని లాయర్లు పిటిషన్‌లో తెలియ‌జేయ‌డంతో ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం పిటిషన్‌ను పరిశీలించారు. పృథ్విరాజ్‌కు నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్ వారెంటు జారీ చేశారు. దీంతో పృథ్వీరాజ్ పీకల్లోతు చిక్కుల్లో ఇరుక్కున్న‌ట్టు అయింది.

Latest News