Actress Anjali | ‘రావాల్సింది నేను.. నాకే చెప్పలేదు’.. పెళ్లిపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన హీరోయిన్‌ అంజలి

  • Publish Date - April 4, 2024 / 08:17 AM IST

Actress Anjali | తెలుగు హీరోయిన్‌ అంజలి త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, పెళ్లిపై అంజలి ఎట్టకేలకు స్పందించింది. తన పెళ్లిపై వస్తున్న వార్తల సంచలన కామెంట్‌ చేసింది. ‘ఫొటో’ చిత్రంలో టాలీవుడ్‌లోకి ఇంట్రీ ఇచ్చిన బ్యూటీ అంజలి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో తనదైన నటనతో మంచి గుర్తింపును తెచ్చుకున్నది. విభిన్న తరహాల్లో నటిస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో హీరోయిన్‌గా మెప్పించింది. మొన్నటి వరకు జోరు కాస్త తగ్గించిన రాజోలు బ్యూటీ.. మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నది. ప్రస్తుతం ఆమె లీడ్‌రోల్‌ చేసిన ‘గీతాంజలి-2.. మళ్లీ వచ్చింది’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ట్రైలర్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. కార్యమానికి హాజరైన అంజలి హాజరైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ క్రమంలోనే మరోసారి పెళ్లి ప్రస్తావన వచ్చింది. ఇటీవల త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందనే వార్తలు రాగా.. విలేకరులను అంజలిని పెళ్లిపై ప్రశ్నించారు. దాంతో అంజలి అదరిపోయేలా కౌంటర్‌ ఇచ్చింది.

‘పెళ్లికి రావాల్సింది నేను. నాకు చెప్పలేదు. ఇప్పటికే నాలుగు సార్లు నాకు పెళ్లి చేశారు. నేను కూడా పెళ్లి వార్తలు విన్నాను. పెళ్లయితే చేసుకుంటాను. కానీ, ఇప్పుడే కాదు. పెళ్లిపై వస్తున్న వార్తలకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పింది. ఇదే సందర్భంల సహజీవనం చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలపై సైతం స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. ఎవరితోనో సహజీవనంలో ఉంటున్నానని వార్తలు వస్తున్నాయని.. తానే తమ ఇంట్లో ఉండటం లేదని.. అవుట్ డోర్‌లో ఉంటున్నానని తెలిపింది. ఉంటున్నవారు ఎవరో తనకు రెంట్‌ ఇచ్చేసి వెళ్లిపోతే బాగుంటుంది.. ఈఎంఐలైనా కట్టుకోవడానిక పనికొస్తుంది తీవ్రంగానే స్పందించింది. చివరకు ఇప్పట్లో ఉండదని తేల్చేసింది. సినిమా ఆఫర్లపై స్పందిస్తూ.. చాలా ఆఫర్లు వస్తున్నాయని.. అన్ని చేయడం లేదని తెలిపింది. తనకు నచ్చిన స్టోరీలను ఎంపిక చేసుకుంటున్నట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అంజలి మూడు సినిమాల్లో నటిస్తున్నది. గీతాంజలి-2 సినిమా ఈ నెల 11న విడుదలవనున్నది. అదే సమయంలో ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’లోనూ కనిపించనున్నది. అలాగే, శంకర్‌ దర్శకత్వంలో రాంచరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నది. రాంచరణ్‌ డబుల్‌ రోల్‌ పోషిస్తుండగా.. ఓ పాత్రకు జోడీగా అంజలి చేయనునున్నట్లు టాక్‌.

Latest News