Site icon vidhaatha

Actress| నితిన్ హీరోయిన్‌కి నాలుగు సార్లు అబార్ష‌న్ అయిందా…ఆమె చెప్పిన విష‌యాలు విని షాక్

Actress| సోష‌ల్ మీడియాలో వ‌చ్చే రూమ‌ర్స్‌కి అడ్డు, అదుపు అనేది ఉండ‌దు. ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు క్రియేట్ చేసుకుంటూ ప్రచారాలు చేస్తారు. అయితే ఈ వార్త‌ల‌పై కొంద‌రు స్పందిస్తే, మ‌రి కొంద‌రు మాత్రం సైలెంట్‌గా ఉంటారు. తాజాగా నితిన్ హీరోయిన్ త‌న‌పై వ‌చ్చిన కొన్ని వార్త‌లు విని చాలా బాధ‌ప‌డ‌ట్టు చెప్పుకొచ్చింది. మ‌రి ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు భావ‌న‌. గోపీచంద్ నటించిన ఒంటరి సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌య‌మైన ఈ కేర‌ళ‌కుట్టి నితిన్, శ్రీకాంత్ వంటి తెలుగు హీరోల‌తో కూడా ప‌ని చేసింది. మ‌హ‌త్మ‌లో చివ‌రిగా నటించ‌గా, ఆ త‌ర్వాత క‌న్న‌డ, మ‌ల‌యాళ సినిమాలు చేస్తూ వార్త‌ల‌లో ఉండేది.

అయితే ఈ అమ‌మ‌డు గ‌తంలో మ‌ల‌యాళ హీరో దిలీప్‌పై సంచల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌ని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసిన‌ట్టు కంప్లైట్ చేయ‌డంతో అత‌నిని అరెస్ట్ కూడా చేశారు. అయితే ప‌లు వివాదాల వ‌ల‌న కొన్నాళ్ల పాటు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చిన భావ‌న 2018లో ప్రొడ్యూసర్ నవీన్ ను వివాహం చేసుకుంది. ఆ త‌ర్వాత త‌న ప‌ని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. అయితే ఆమె నటించిన మలయాళ మూవీ నడికర్ ప్రమోషన్ లో భాగంగా ఆమె తనపై వస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాల‌పై స్పందిస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. నేను అమెరికా వెళ్లి అబార్షన్ చేయించుకున్నా అని.. గర్భస్రావం అయ్యిందని.. చెన్నైలో అబార్షన్ చేయించుకున్నా అని నాపై చాలా దారుణంగా ప్ర‌చారాలు చేశారు.

అస‌లు అవ‌న్నీ వింటుంటే నాకు అసహ్యం వేసింది. కొంద‌రు అయితే నాకు నాలుగు సార్లు అబార్షన్ అయ్యిందని, గర్భస్రావం అవ్వడం వల్ల చనిపోయానంటూ త‌ప్పుడు ప్ర‌చారాలు చేశారు. ఆ రూమ‌ర్స్ విని నేను చాలా బాధ‌ప‌డ్డాను. అయితే ఇప్పుడు మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్న‌ట్టు భావ‌న చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు కన్నడ చిత్రాలు, ఒక మలయాళం, ఒక తమిళ సినిమాలు ఉన్నాయి. మ‌రి కొన్ని క‌థ‌లు వింటున్న‌ట్టు తెలుస్తుంది. ఎలాంటి కాంట్ర‌వ‌ర్సీస్‌కి వెళ్ల‌కుండా సినిమాలు చేసుకుంటూ హాయిగా త‌న లైఫ్ సాగేలా చూసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ‌.

Exit mobile version