Actress| ఇంత క్యూట్‌గా ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండ‌స్ట్రీని కుమ్మేస్తుంది..!

Actress| సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. త‌మ అభిమాన హీరో లేదా న‌టీమ‌ణులు చిన్న‌ప్ప‌టి పిక్ చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. కొంద‌రు చిన్న‌ప్పుడు ఎలా ఉన్నారో పెద్దయ్యాక కూడా అలానే ఉండ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోతుంటారు. అయితే

  • Publish Date - May 26, 2024 / 02:01 PM IST

Actress| సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. త‌మ అభిమాన హీరో లేదా న‌టీమ‌ణులు చిన్న‌ప్ప‌టి పిక్ చూసి ఫ్యాన్స్ మైమ‌ర‌చిపోతున్నారు. కొంద‌రు చిన్న‌ప్పుడు ఎలా ఉన్నారో పెద్దయ్యాక కూడా అలానే ఉండ‌డం చూసి ఆశ్చ‌ర్య‌పోతుంటారు. అయితే ఇప్పుడు ఓ హాట్ బ్యూటీ చిన్న‌నాటి పిక్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. ఆమె ఎవ‌రో కాదు తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టి మైండ్ బ్లాక్ చేసిన ముద్దుగుమ్మ నేహా శెట్టి. ‘డీజే టిల్లు’,‘టిల్లు స్క్వేర్’ లో నటించిన రాధికా.. అలియాస్ నేహా శెట్టి ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు.

డీజే టిల్లులో చాలా రొమాంటిక్‌గా న‌టించి యూత్‌కి కంటిపై క‌నుకులేకుండా చేసింది. ఆ సినిమా త‌ర్వాత కొన్నాళ్ల‌పాటు నేహా శెట్టిని ఎవ‌రు మ‌ర‌చిపోలేదు. ఈ అమ్మ‌డు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘మెహబూబా’ మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విష‌యం తెలిసిందే. ఆ తర్వాత గల్లీ రౌడీ మూవీలో నటించింది.. ఈ రెండు సినిమాలు ఆమె ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఆ త‌ర్వాత జొన్నల గడ్డ సిద్దు హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ లో రాధిక పాత్ర పోషించి అంద‌రిని త‌న‌వైపుకు తిప్పుకుంది. రాధిక అంటే నేహా శెట్టి గుర్తుకు వ‌చ్చేలా డీజే టిల్లు మూవీలో న‌టించి మెప్పించింది.

డీజే టిల్లు సక్సెస్ తర్వాత “బెదురులంక 2012”, “రూల్స్ రంజన్” సినిమాలు చేసింది నేహా శెట్టి. రూల్స్ రంజన్ సినిమాలో సమ్మోహనుడా సాంగ్ ఛాట్ బస్టర్ కాగా, ఈ పాటలో నేహా శెట్టి తన డ్యాన్సింగ్ తో పిచ్చెక్కిపోయేలా చేసింది. అమ్మడి స్టెప్స్ చూసి కుర్రకారు పిచ్చెక్కిన‌ట్టు ఊగిపోయారు.తెలుగులో చేసిన మూడు సినిమాలు వరుసగా హిట్ కావడంతో నేహా శెట్టి మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది. అందుకే గ్లామర్ ఫ్లస్ పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న హీరోయిన్ కావాలనుకునే వారు నేహాశెట్టి వైపే లుక్కేస్తున్నారు. యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు ఇంటర్నెట్ లో గ్లామర్ షోతో కూడా మ‌త్తెక్కిస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫ్రెష్ అందాలను ఆరబోస్తూ రొమాంటిక్ కిక్కిస్తున్న నేహా శెట్టి రానున్న రోజుల‌లో స్టార్ హీరోయిన్ గా మార‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Latest News