Actress Divya Bharathi | ఆ సూటిపోటి మాటలతో జనంలో నడిచేందుకు భయపడేదాన్ని.. హీరోయిన్‌ దివ్యభారతి వ్యాఖ్యలు వైరల్‌..!

Actress Divya Bharathi | తమిళ్‌ హీరోయిన్‌ దివ్య భారతి సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నది కోజిక్కోడ్‌ అమ్మడు. తొలి సినిమాతోనే తన అందం.. నటనతో ప్రేక్షకుల మనసులను ఆమె గెలుచుకున్నారు.

Actress Divya Bharathi | తమిళ్‌ హీరోయిన్‌ దివ్య భారతి సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నది. మొదట మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్నది కోజిక్కోడ్‌ అమ్మడు. తొలి సినిమాతోనే తన అందం.. నటనతో ప్రేక్షకుల మనసులను ఆమె గెలుచుకున్నారు. సినిమాల్లోకి రాక ముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గానూ రాణించింది. తనదైన గ్లామర్‌తో ఫాలోవర్స్‌ను భారీగా పెంచుకున్నది. జీవీ ప్రకాశ్‌ దర్శకత్వం వహించిన ‘బ్యాచిలర్‌’ సినిమాతో హీరోయిన్‌గా దివ్య భారతీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత ‘మదిల్ మెయిల్ కాదల్’ సినిమాల్లోనూ కనిపించింది. తెలుగులో సుధీర్‌ సరసన ‘గోట్‌’ మూవీలో నటించి.. టాలీవుడ్‌కు పరిచమైంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు జరిగిన అవమానాల గురించి చెప్పుకొచ్చింది.  కళాశాలలో చదివే రోజుల్లో తనను సూటిపోటి మాటలతో వేధింపులకు గురి చేసేవారని.. తన శరీరాకృతిపై తోటి విద్యార్థులు ఆట పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఫాండా బాటిల్’, ‘అస్థి పంజరం’ అంటూ కామెంట్‌ చేశారని.. అవి తనపై చాలానే ప్రభావం చూపాయని చెప్పుకొచ్చింది. ఆ మాటలతో తన శరీరంపైనే అసహ్యం వేసేదని.. ఆ మాటలతో జనం ముందు నడిచేందుకు సైతం భయపడేదానన్ని ఆవేదన వ్యక్తం చేసింది.

2015లో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ తెరిచానని.. అప్పటి నుంచే తన మోడలింగ్‌ కెరీర్‌ మొదలైందని తెలిపింది. అప్పటి నుంచే తనను అందరూ మెచ్చుకునేవారని పేర్కొంది. శరీర ఆకృతిని కలిగి ఉండడం ముఖ్యం కాదని.. విమర్శల మధ్య మిమ్మల్ని మీరు ఎలా ప్రేమిస్తున్నారనేది ముఖ్యమని చెప్పింది. ఈ విషయం చెప్పడానికి నాకు ఆ రోజుల్లో ఎవరైనా ఉండి ఉంటే బాగుండేదందని పేర్కొంది. ప్రస్తుతం దివ్య భారతి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దివ్యభారతి ఇటీవల తెలుగులో సుధీర్‌ సరసన గోట్‌ మూవీలో కనిపించింది. అలాగే తమిళ నటుడు విజయ్‌ సేతుపతి ‘మహరాజ’ మూవీలోనూ కనిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.