Site icon vidhaatha

Nivetha Pethuraj | పోలీసులపై నటి నివేదా సేతురాజ్ ఫైర్‌

వైరల్‌గా మారిన వీడియో

విధాత: సినీనటి నివేధా సేతురాజ్ అంటే సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేదు. అయితే ఆమె తాజాగా పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె వెళ్తున్న కారును పోలీసులు ఆపి, తనిఖీలో భాగంగా డిక్కీ ఓపెన్ చేయాలని కోరగా.. ఆమె అందుకు నిరాకరించారు.

రోడ్డు వరకు వెలుతున్నానని, నా దగ్గర అన్ని పేపర్స్ కరెక్టుగానే ఉన్నాయని, కావాలంటే చెక్ చేసుకోండని, డిక్కీలో ఏం లేవని అర్ధం చేసుకోండని నేను ఇప్పుడు డిక్కీ ఓపెన్ చేయలేనని, అది పరువుకు సంబంధించిన మ్యాటర్ అని, మీకు చెప్పినా అర్థం కాదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

పక్కనే ఓ వ్యక్తి ఇదంతా రికార్డ్ చేయగా.. అతనిపై ఫైర్ అయ్యారు. ఎంత సెలబ్రెటీలైనా విధి నిర్వాహణలో ఉన్న పోలీసులకు సహకరించకుండా దురుసుగా వ్యవహారించడం బాగాలేదని నెటిజన్లు నివేదా తీరుపై ఫైర్ అవుతున్నారు. దాస్‌కా డమ్కీ చిత్రంతో అలరించిన నివేదా తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగానే ఇదంతా చేసిందని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version