విధాత: అడవిలో వన్యప్రాణుల సంచారం..పరస్పరం వేటాడుకునే దృశ్యాలు సఫారీ టూర్ లలోనో..డిస్కవరీ చానల్స్ లోనూ చూస్తుంటాం. ఆహారం కోసం వన్యప్రాణులు బలం తెగువతో పాటు జిత్తుల మారి ఎత్తులను కూడా అనుసరిస్తుండటం కనిపిస్తుంది. అయితే ఓ అడవిలో చిరుత పులి జింకను వేటాడిన దృశ్యం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. పొదల మధ్యన జంతువుల కోసం ఎదురుచూస్తు మాటు వేసింది ఓ చిరుత పులి. అది తన ఉనికి కనిపించకుండా గడ్డి పొదల్లో దాక్కుని అటుగా వచ్చే జంతువుల కోసం ఎదురుచూస్తుంది. అదే సమయంలో అడవి కుక్కల గుంపులు జింకల గుంపును తరిమాయి.
వాటి బారి నుంచి కాపాడుకునేందుకు జింకలు తలో దిక్కు పరుగుతీశాయి. ఇదే అదనుగా సమీప పొదల్లో మాటువేసిన చిరుత పులి వేగంగా గెంతుతూ పరుగెత్తుతూ తనను గమనించకుండా తనవైపు వచ్చిన ఓ జింకను గాల్లోనే పట్టేసి..నోట కరుచుకుంది. ఈ వేట దృశ్యం చిరుత వేగానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు జింకను వేటాడిన చిరుత ఎత్తులు..వేగం చూసి తీరాల్సిందేనంటున్నారు. అదే సమయంలో పాపం జింక అడవి కుక్కల బారి నుంచి తప్పించకోబోయే చిరుత పులికి బలైపోయిందంటూ కామెంట్లు పెట్టారు.
A leopard on the hunt improvises when interrupted by a nearby wild dog hunt pic.twitter.com/WWJndtfJ1D
— Damn Nature You Scary (@AmazingSights) October 21, 2025