Site icon vidhaatha

సముద్రం పాము..ఎంత పనిచేసింది!

seasnake-eats-moray-eel

విధాత : శక్తికి మించిన పని..తిండి మొదటికే మోసం తేస్తుందనడానికి నిదర్శనంగా ఓ సముద్రం పాము చేసిన నిర్వాకాన్ని చెప్పవచ్చు. చిన్న చేపలను పెద్ద చేపలు..బలహీనమైన చిన్న జంతువులను బలమైన పెద్ద జంతువులు ఆహారంగా తీసుకోవడం ప్రకృతి సహజంగా కొనసాగుతుంది. అయితే ఓసముద్రపు పాము ఆహారపు వేటలో చూపిన దురాశ దాని ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన వీడియో వైరల్ గా మారింది. అందమైన ఓ సముద్రపు పాము తన శరీరం పొడవు సైజులో ఉన్న ఈల్ చేపను మింగేసింది. అయితే ఎంతకు దానిని తన పొట్టలో నిగ్రహించుకోలేక..చివరకు ఆయాసంతో రొప్పుతూ..ఊపిరాడక చచ్చే పరిస్థితి ఎదురైంది.

పొట్టలోపల ఈల్ చేప కదలికలతో అటు ఇటు గింజులాడుకున్న సముద్రపు పాము చివరకు చేసేది లేక..బతుకు జీవుడా అనుకుంటూ తిరిగి ఈల్ చేపను బయటకు కక్కి వేసింది. పాము పొట్ట నుంచి బయటపడిన ఈల్ చేప ప్రాణాలతోనే ఉండటం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు శక్తికి మించిన పని..జీర్ణం కాకుండా పీకల దాక వచ్చే తిండి మంచిది కాదనడానికి.. సముద్రపు పాము నిర్వాకం ఓ గుణపాఠం అని కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version