Python : న‌గ‌ర వీధుల్లో భారీ కొండ‌చిలువ‌.. ఎలా తిరుగుతోందో చూడండి

ఇండోనేషియా (Indonesia) బాలి ద్వీపంలో (Bali Island) గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల‌కు (nonstop rainfall) వీధుల‌న్నీ న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఆ నీటిలో ఓ భారీ కొండ చిలువ (Python) ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది చూసిన స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

Python

Python | భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు పాములు, కొండ చిలువ‌లు వంటి విషస‌ర్పాలు వీధుల్లోకి వ‌స్తుంటాయి. మొస‌ళ్లు కూడా రోడ్ల‌పై రోమింగ్ చేస్తూ ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి చోటు చేసుకుంది. భారీ కొండ చిలువ (Python) న‌గ‌ర వీధుల్లో తిరుగుతూ క‌నిపించింది.

ఇండోనేషియా (Indonesia) బాలి ద్వీపంలో (Bali Island) గ‌త మూడు రోజులుగా ఎడ‌తెరిపి లేకుండా వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల‌కు వాగులు, వంక‌లు నిండి పొంగి పొర్లుతున్నాయి. ప్ర‌ధాన ర‌హ‌దారులు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని కాల‌నీలు వ‌ర్ష‌పు నీటితో న‌దుల‌ను త‌ల‌పిస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఆ నీటిలో ఓ భారీ కొండ‌చిలువ స్థానికుల కంట ప‌డింది. సుమారు 5 మీట‌ర్ల పొడ‌వు ఉన్న ఆ భారీ పైతాన్‌.. నీళ్ల‌లో ఈదుతూ ముందుకు వెళ్తోంది.

ఈ విష‌స‌ర్పాన్ని గ‌మ‌నించిన స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఆ దృశ్యాల‌ను త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియోలు వైర‌ల్‌గా మారాయి. ఆ వీడియోని చూసిన నెటిజ‌న్లు ఒక్క‌సారిగా షాక్ అవుతున్నారు. వామ్మో అంత పెద్ద కొండ‌చిలువా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

BRS : రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ రైతు భరోసా అస్త్రం!
Mexican Couple | ప‌డ‌వే వివాహ వేదిక‌.. వార‌ణాసిలో గంగ‌మ్మ సాక్షిగా ఒక్క‌టైన మెక్సికో జంట‌

Latest News