Mexican Couple | వారణాసి (Varanasi).. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, పవిత్రమైన నగరాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ (UP) రాష్ట్రంలో గంగా నది ఒడ్డున ఉన్న ఈ నగరం ఆధ్యాత్మికతకు, సంస్కృతికి నిలయం. అంతటి ప్రఖ్యాత, ఆధ్యాత్మిక నగరం ఇప్పుడు ఓ అపూర్వ వేడుకకు వేదికైంది. మెక్సికో (Mexica)కు చెందిన ఓ జంట (Mexican Couple) గంగమ్మ సాక్షిగా ఒక్కటయ్యారు.
మెక్సికోకు చెందిన రూయిజ్ కాబ్రోల్, గొంజలో మిగుల్.. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మంపై బలమైన నమ్మకం ఉంది. తమ వైవాహిక జీవితాన్ని వారణాసి నుంచే ప్రారంభించాలని సంకల్పించారు. ఇందులో భాగంగానే భారత్ వచ్చిన ఈ జంట.. గంగమ్మ ఒడిలో వేద మంత్రాల సాక్షిగా వివాహ బంధంతో ఒక్కటైంది. అస్సీ ఘాట్ (Assi Ghat) వద్ద గంగానది మధ్యలో ఓ పడవ (Boat)పై హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరిగింది.
వధూవరులిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం దుస్తులు ధరించారు. వరుడు ధోతీ కుర్తా ధరించగా.. వధువు బనారసి చీరతో అందంగా ముస్తాబయ్యారు. పూలతో అలంకరించిన పడవలో హోమం నిర్వహించారు. ఆచార్య దీపక్ పాండే సమక్షంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహబంధంతో ఒక్కటయ్యారు. స్థానికులు, భక్తులు, యాత్రికులు వీరి వివాహ వేడుకను ఎంతో ఆసక్తిగా తిలకించారు.
నూతన వధూవరులపై పూల వర్షం కురిపించి ఆశీస్సులు అందించారు. మెక్సికో నుండి వచ్చి వారణాసిలో ఇలా సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోవడం అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ అపురూప క్షణాలతో పలువురు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఇవి కూడా చదవండి :
ViRosh Wedding : వివాహ బంధంతో ఒక్కటైన విజయ్, రష్మిక..!
Telangana | మార్చి 1 నుంచి తెలంగాణలో పెరగనున్న వాహనాల ధరలు.. టూ వీలర్‌పై రూ. 2 వేలు..!
