ఇట‌లీలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం.. 60 మంది మృతి

-మ‌రో 60 మందికిపైగా గ‌ల్లంతు విధాత‌: ద‌క్షిణ ఇటలీ (ITALY) స‌ముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం (BOAT MISHAP) చోటుచేసుకున్న‌ది. 60 మంది చనిపోగా, మ‌రో 60 మందికిపైగా గ‌ల్లంతైన‌ట్టు అధికారులు చెప్తున్నారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. తుర్కియే (TURKEY)నుంచి 200 మందికిపైగా ఇట‌లీకి వ‌ల‌స‌ (MIGRATE) పోతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తున్న‌ది. అఫ్గానిస్తాన్‌ (AFGHANISTHAN), పాకిస్తాన్‌ (PAKISTHAN), సోమాలియా (SOMALIA), ఇరాన్ (IRAN) త‌దిత‌ర దేశాల పౌరులు […]

ఇట‌లీలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం.. 60 మంది మృతి

-మ‌రో 60 మందికిపైగా గ‌ల్లంతు

విధాత‌: ద‌క్షిణ ఇటలీ (ITALY) స‌ముద్ర తీరంలో ఘోర ప‌డ‌వ ప్ర‌మాదం (BOAT MISHAP) చోటుచేసుకున్న‌ది. 60 మంది చనిపోగా, మ‌రో 60 మందికిపైగా గ‌ల్లంతైన‌ట్టు అధికారులు చెప్తున్నారు. మృతుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు కూడా ఉన్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి.

తుర్కియే (TURKEY)నుంచి 200 మందికిపైగా ఇట‌లీకి వ‌ల‌స‌ (MIGRATE) పోతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు తెలుస్తున్న‌ది. అఫ్గానిస్తాన్‌ (AFGHANISTHAN), పాకిస్తాన్‌ (PAKISTHAN), సోమాలియా (SOMALIA), ఇరాన్ (IRAN) త‌దిత‌ర దేశాల పౌరులు చెక్క ప‌డ‌వ‌లో వెళ్తుండ‌గా, ప్ర‌తికూల వాతావ‌ర‌ణంలో రాళ్ల‌కు కొట్టుకుని ప‌డ‌వ మునిగిపోయిన‌ట్టు స‌మాచారం.

కాగా, మృత‌దేహాలు కాల‌బ్రియా (CALABRIA) తీరంలోని ఓ రిసార్టు (RESORT)స‌మీపానికి కొట్టుకువ‌చ్చాయి. అధికారులు (OFFICIALS) వాటిని స్వాధీనం చేసుకున్నారు. 80 మంది సుర‌క్షితంగా ఉన్నార‌ని, మ‌రో 60 మందికిపైగా ఆచూకీ తెలియాల్సి ఉంద‌ని వారు తెలిపారు. మిగ‌తావారి కోసం గాలిస్తున్న‌ట్టు వివ‌రించారు. మ‌రోవైపు మృతుల్లో 30 మందిదాకా పాకిస్తానీయులున్న‌ట్టు తెలుస్తున్న‌ది.

తుర్కియేలో ఇటీవ‌ల భీక‌ర భూకంపం (EARTH QUAKE) వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వేల‌ల్లో ప్రాణ న‌ష్టం జ‌రిగిన సంగ‌తీ విదిత‌మే. ఈ క్ర‌మంలోనే అక్క‌డ త‌ర‌చూ భూ ప్ర‌కంప‌న‌లు వ‌స్తుండ‌గా, చాలామంది ప్రాణాల‌ను అర‌చేతిలో పెట్టుకొని అక్క‌డి నుంచి వెళ్లిపోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇలా వెళ్లిపోతున్న‌వారినే ప‌డ‌వ ప్ర‌మాదం రూపంలో మృత్యువు క‌బ‌ళించ‌డం విషాద‌క‌రం.