Sicily Landslide : విరిగిపడిన కొండ చరియలు..కూలిన ఇళ్ల వీడియో వైరల్

ఇటలీలో ప్రకృతి బీభత్సం! కొండచరియలు విరిగిపడి లోయలోకి జారిపోతున్న ఇళ్లు. సిసిలీలో 1500 మంది తరలింపు.. హ్యారీ తుపాను ధాటికి వణికిపోతున్న నిస్కెమి పట్టణం.

Sicily Landslide : విరిగిపడిన కొండ చరియలు..కూలిన ఇళ్ల వీడియో వైరల్

విధాత : ఇటలీ దేశంలోని సిసిలీలో భారీ కొండ చరియాలు విరిగిపడిన ప్రమాదంలో కొండ ప్రాంతాల్లోని ఇండ్లు కూలిపోయిన దృశ్యాల వీడియోలు వైరల్ గా మారాయి. సిసిలీ పట్టణంలో సంభవించిన ప్రకృతి విపత్తుతో భారీ వర్షాల వరదల కారణంగా భారీ కొండచరియలు విరిగిపడటంతో పర్వత ప్రాంతాల్లోని ఇండ్లు జారుడు బండలాటలాడినట్లుగా కొండల నుంచి కిందకు కూలిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సమస్య తీవ్రతను చాటుతూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఈ ప్రకృతి విపత్తు నుంచి సుమారు 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వర్షం కారణంగా పెద్ద ఎత్తున బురద కొండ పైనుంచి దొర్లుకుంటూ వచ్చి దిగువ ప్రాంతాల్లోని జనావాసాల్లోకి దూసుకరావడంతో …అక్కడ నివసిస్తున్న వారి ఇండ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. సిసిలీ ప్రకృతి విపత్తుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

 

ఇవి కూడా చదవండి :

Avalanche Swallows Sonamarg : సోనామార్గ్‌ను ముంచెత్తిన అవలాంచ్‌.. భయానక దృశ్యాలు
Greater Flamingos : అరుదైన అతిథులు.. ఫ్లెమింగో పక్షులు వచ్చేశాయ్