Italy | భారత్, పాక్, బంగ్లాదేశ్ వాళ్లు డిస్కౌంట్లు అడగొద్దు.. టర్కీలో షాప్ యజమాని తుంటరి పని!

Italy | విధాత: ఇస్తాంబుల్ లోని తుర్కియేలో ఓ షాపు యజమాని దక్షిణాసియా ప్రజలను అవమానించేలా పెట్టిన ఓ బోర్డు వివాదస్పదమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షాపు ముందు పెట్టిన బోర్డులో భారత్ , పాకిస్థాన్, బంగ్లాదేశ్ సోదరులారా.. దయచేసి డిస్కౌంట్లు అడగొద్దు’ అని రాసి ఉంది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఓ వ్యక్తి అప్‌లోడ్ చేశారు.
ఇస్తాంబుల్‌లో దక్షిణాసియా ప్రజలకు ప్రత్యేకంగా ఎలాంటి తగ్గింపులు లేవని రాసి ఉన్న నోట్‌ను గుర్తించానని ఆ వ్యక్తి పేర్కొన్నారు. ఇది కాస్త వైరల్‌గా మరడంతో పలువురు నెటిజన్లు ఆ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోర్డులో రాసిన వ్యాఖ్యలు దక్షిణాసియా ప్రజలను అవమానించడమేనంటూ మండి పడుతున్నారు. ‘సరిహద్దుల పరంగా తాము విడిగా ఉంటాం. కానీ, ఇబ్బందులు ఏమైనా ఎదురైనప్పుడు కలిసి పోతాం’ అని కొందరు కామెంట్ పెట్టారు. అలాంటి బోర్డు సరైన చర్య కాదని మరి కొందరు కామెంట్లు చేశారు.