Samsung Galaxy M17e 5G | 15వేల లోపే బెస్ట్ స్మార్ట్‌ఫోన్.. భారీ బ్యాటరీ, ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ !
Samsung Galaxy M17e 5G | దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ చవకైన ధరలో గెలాక్సీ ఎం17e 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 6000 mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 26 గంటల పాటు నాన్‌స్టాప్‌గా చూడొచ్చు. అలాగే ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తుంది.
Samsung Galaxy M17e 5G | దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ చవకైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. M సిరీస్‌లో గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్‌ను భారత్‌లో విడుదల చేసింది. 6000 mAh బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 26 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వీడియోలు చూడవచ్చని శాంసంగ్ కంపెనీ చెప్పింది. ఈ ఫీచర్ ఇప్పుడు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఎం సిరీస్‌లో వచ్చిన ఈ మొబైల్‌లో ఆక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6000 సిరీస్ చిప్‌సెట్ ఉంది. పిల్ ఆకారపు మాడ్యుల్‌లో అమర్చిన డ్యూయల్ రేర్ కెమెరా కూడా ఉంది. ప్రస్తుతం ఈ మొబైల్ 4జీబీ, 6జీబీ ర్యామ్‌లతో వస్తుంది. 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.13,999గా, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ మొబైల్ ధరను రూ.15,499గా నిర్ణయించారు. ప్రస్తుతం ఈ మొబైల్ ప్రముఖ ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ ధరలో
శాంసంగ్ గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్ రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. బ్లిట్స్ బ్లూ, వైబ్ వయలెట్ రంగుల్లో లభిస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
* శాంసంగ్ గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్ 6.58 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది గరిష్టంగా 120 Hz రిఫ్రెష్ రేట్‌ను, 16 మిలియన్ల రంగులను అందిస్తుంది.
* ఈ స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్‌ను కలిగి ఉంది. ఇది దుమ్ము, నీటి తుంపర్లను నిరోధిస్తుంది.
* ఆండ్రాయిడ్ 16 ఆధారిత OneUI8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. అంతేకాకుండా ఆరు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనున్నట్లు శాంసంగ్ కంపెనీ తెలిపింది.
* ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300ప్రాసెసర్‌తో నడుస్తుంది. 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరించుకునే అవకాశం ఉంది.
* కెమెరా వియానికొస్తే.. ఈ మొబైల్ డ్యూయల్ రేర్ కెమెరా యూనిట్‌తో వస్తుంది. ఇందులో f/1.8 ఎపర్చర్, ఆటోఫోకస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. అలాగే f/2.4 ఎపర్చర్‌తో కూడిన 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 1080p @ 30fps వరకు వీడియోలను రికార్డు చేయవచ్చు.
* ఇక ఈ మొబైల్ 6000mAh సామర్థ్యం గల బ్యాటరీతో వస్తుంది. అంటే ఒక్కసారి ఛార్జి చేస్తే 26 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్‌ను అందిస్తుందని శాంసంగ్ కంపెనీ చెబుతోంది.
ఇంకా ఏమున్నాయి?
* 5జీ, 4జీ LTE
* వైఫై, బ్లూటూత్ 5.3
* USB Type C
* 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్
* ఫింగర్‌ప్రింట్ సెన్సార్
మొత్తంగా బడ్జెట్‌లో మంచి బ్యాటరీ, లాంగ్ టర్మ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ కోరుకునే వారికి శాంసంగ్ గెలాక్సీ ఎం17e 5జీ మొబైల్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Read More :
వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!
స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram