OPPO K14x 5G | స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

OPPO K14x 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో స్టూడెంట్స్ కోసం చవక ధరలో 5జీ మొబైల్‌ను తీసుకొచ్చింది. K సిరీస్‌లో OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌కు ఇప్పటికే ఉన్న మోడళ్లకు అదనంగా 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజి‌తో కొత్త బేస్ వేరియంట్‌ను ఇండియాలో విడుదల చేసింది.

OPPO K14x 5G | స్టూడెంట్స్ కోసం చవకైన 5జీ ఫోన్.. ఒప్పో కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే?

OPPO K14x 5G | బడ్జెట్ ధరలో దొరికే 5జీ ఫోన్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. K సిరీస్‌లో OPPO K14x 5G స్మార్ట్‌ఫోన్‌కు కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే ఉన్న మోడళ్లకు అదనంగా 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజి‌తో కొత్త బేస్ వేరియంట్‌ను ఇండియాలో విడుదల చేసింది. విద్యార్థులతో పాటు కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనేవారిని దృష్టిలో పెట్టుకుని ఈ వేరియంట్‌ను తీసుకొచ్చినట్లుగా ఒప్పో కంపెనీ తెలిపింది.

భారత్‌లోకి కొత్తగా తీసుకొచ్చిన ఈ బేస్ వేరియంట్‌ (4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ) ను ధరను రూ.12,999గా నిర్ణయించారు. ఇక ఇప్పటికే 4జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ మొబైల్ ధర రూ.14,999; 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ధర రూ.16,999గా ఉంది. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే వారికి రూ.750 వరకు ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే మూడు నెలల నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఆఫర్లు అన్ని వేరియంట్లపై అందుబాటులో ఉన్నాయి. ఒప్పో ఇండియా అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి లేదా ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మోడల్ అందుబాటులో ఉంది.

ఈ మొబైల్ రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఐస్ బ్లూ, ప్రిసమ్ వయోలిట్ కలర్లలో అందుబాటులోకి వస్తుంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫోన్ పనితీరు స్మూత్‌గా ఉండేందుకు 42 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్‌ను కూడా కంపెనీ ఇస్తుంది.

OPPO K14x 5G స్పెసిఫికేషన్లు

6.75 అంగుళాల హెచ్‌డీ+ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz డిస్‌ప్లే రీఫ్రెష్ రేట్, 1125 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. అలాగే డస్ట్, స్పాష్ నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది. 5జీ కనెక్టివిటీ కూడా ఉంది. కనెక్టివిటీ కోసం Wifi 5, బ్లూటూత్ 5.4, యూఎస్‌బీ టైప్-సి, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, జీపీఎస్, గెలిలియో, GLONASS వంటి నావిగేషన్ సిస్టమ్‌లు కూడా ఉన్నాయి.

ఫొటోగ్రఫీ కోసం ఈ మొబైల్‌లో డ్యుయెల్ రేర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఇచ్చారు. బ్యాటరీ విషయానికొస్తే 6500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు చేస్తుంది.

Read More :

OPPO Find N6 | ఒప్పో నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. 200MP కెమెరా సహా అదిరిపోయే ఫీచర్లు!

రోబో కుక్కతో వాకింగ్‌కు వెళ్లిన రోబో.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!