Strange Trees: మనిషి ఆకృతులతో వింతచెట్లు!

Strange Trees: ప్రకృతి రకరకాల వృక్షాలు, మొక్కులకు..జీవరాశులకు నిలయం. అయితే వృక్షాలలో ఎన్నో వింత వృక్షాలు సహజంగా ఉంటే.. మరికొన్ని మనుషుల ప్రయత్నాలతో కోరిన ఆకృతులతో మలచబడి ఆశ్చర్యానుభూతులను అందిస్తుంటాయి. అలాంటి వింత చెట్లే ఇటలీలో సందర్శకులను అలరిస్తున్నాయి.
వాటిలో ఒకటి సహజంగా ఏర్పడితే.. మరోకటి మానవ ప్రయత్నంగా వింతాకృతిని సంతరించుకుంది. ఇటలీ థింకింగ్ ట్రీ(మనిషి ముఖం ఆలోచన ముద్ర)తో కూడిన పురాతన వృక్షం సందర్శకులకు ఆకట్టుకుంటుంది. ఆలివ్ జాతికి చెందిన ఈ వృక్షం మనిషి ఆలోచన ముద్ర ఆకృతిలో సహజసిద్ధంగా రూపుదాల్చుకోగా..అది థింకింగ్ ట్రీగా ప్రఖ్యాతి గాంచింది.
ఇక మరో వృక్షం ది ట్రీ ఆఫ్ లైఫ్. ఇటలీలోని టస్కానీలోని చారిత్రాత్మక లూకాలోని పియాజ్జా డెల్’అన్ఫిటియాట్రోలో ఆండ్రియా రోగి తీర్చిదిద్దిన ది ట్రీ ఆఫ్ లైఫ్ సందర్శకులకు ఎప్పటికే ప్రత్యేకమే. ప్రేమికులు పరస్పరం లిప్ కిస్ లో మునిగి శృంగారంలో మునిగినట్లుగా కనిపించే ఈ వృక్షం యువతను విశేషంగా ఆకర్షిస్తుంది.
ఆధునిక కాలంలో చెట్లను వివిధ డిజైన్లలో పెంచే ప్రక్రియను మనదేశంలోనూ చాల చోట్ల కొనసాగుతుంది. ముఖ్యంగా ఎకో పార్కులలో ఈ తరహా వింత చెట్ల పెంపకం ఇటీవల సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. మానసికోల్లాసం కల్గించే వివిధ రకాల వింత ఆకృతుల వృక్షాలతో కూడిన పార్కులకు సందర్శకుల ఆదరణ కూడా ఉండటం విశేషం.