Vijay-Trisha | విజయ్-త్రిష ఒకే కారులో.. వైరల్ వీడియోతో మళ్లీ వేడెక్కిన రూమర్స్

Vijay-Trisha | ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా హీరోల పెళ్లిళ్లతో సందడి కనిపిస్తుండగా, మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో మాత్రం విడాకుల పరంపర కొనసాగుతోంది. ఏడాదికొకరు చొప్పున కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వివాహ బంధానికి గుడ్‌బై చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

  • By: sn |    movies |    Published on : Mar 06, 2026 7:51 AM IST
Vijay-Trisha | విజయ్-త్రిష ఒకే కారులో.. వైరల్ వీడియోతో మళ్లీ వేడెక్కిన రూమర్స్

Vijay-Trisha | ఇటీవలి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా హీరోల పెళ్లిళ్లతో సందడి కనిపిస్తుండగా, మరోవైపు తమిళ సినీ పరిశ్రమలో మాత్రం విడాకుల పరంపర కొనసాగుతోంది. ఏడాదికొకరు చొప్పున కోలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు తమ వివాహ బంధానికి గుడ్‌బై చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే జీవీ ప్రకాష్ కుమార్, ధనుష్, రవి మోహన్ వంటి స్టార్‌లు తమ భార్యలతో విడాకులు తీసుకోగా, ఇప్పుడు ఆ జాబితాలోకి తమిళ స్టార్ హీరో విజయ్ కూడా చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల విజయ్ భార్య సంగీత కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీరి విడాకుల వ్యవహారాన్ని పరిష్కరించుకునేందుకు విజయ్ దాదాపు రూ.250 కోట్ల భరణం ఇవ్వడానికి సిద్ధమయ్యారని కూడా తమిళ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో విజయ్ సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఆయన స్థాపించిన టీవీకే కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సమయంలో ఈ విడాకుల అంశం బయటకు రావడం ఆయనకు రాజకీయంగా కూడా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అధికార, ప్రతిపక్ష నాయకులు కూడా ఈ అంశంపై విమర్శలు చేస్తూ ట్రోలింగ్ చేయడంతో విషయం మరింత చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా విజయ్‌కు ప్రముఖ నటి త్రిషతో సన్నిహిత సంబంధం ఉందనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో జరిగిన ప్రముఖ నిర్మాత కళైపులి ఎస్ సురేశ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఇద్దరూ ఒకే కారులో రావడం అక్కడి వారిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య సంబంధాలపై ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా కలిసి ఒకే కారులో కార్యక్రమానికి రావడం మరింత చర్చకు దారి తీసింది.

ఇక ఈ వీడియోను చూసిన కొందరు నెటిజన్లు, విజయ్–త్రిష మధ్య ఉన్న సంబంధాలపై వస్తున్న వార్తలు నిజమేనేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు అభిమానులు మాత్రం ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాల్సి ఉంది.