Iran US war | దుబాయిపై కొనసాగుతున్న దాడులు
కవ్వింపు చర్యలు లేకుండా తాము పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత కూడా మధ్య ఆసియా దేశాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. దుబాయి, అబుదాబిలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మధ్య ఆసియా లోని పలు దేశాల గగనతలాల్లోకి క్షిపణలు దూసుకొచ్చాయి.
Iran US war | కవ్వింపు చర్యలు లేకుండా తాము పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత కూడా మధ్య ఆసియా దేశాలు బాంబుల మోతతో దద్దరిల్లాయి. దుబాయి, అబుదాబిలో పేలుళ్లు చోటు చేసుకున్నాయి. మధ్య ఆసియా లోని పలు దేశాల గగనతలాల్లోకి క్షిపణలు దూసుకొచ్చాయి. ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ దేశాలు దుబాయి, ఇతర దేశాల నుంచి తమ పౌరులను వెనక్కు సురక్షితంగా తీసుకు వచ్చేందుకు చర్యలు చేపడుతున్నాయి.
15 బాలిస్టిక్ క్షిపణులు, 119 డ్రోన్లను తాము శనివారం ఇంటర్‌సెప్ట్ చేసినట్టు యూఏఈ ప్రకటించింది. ఒక్క మిసైల్, రెండు డ్రోన్లు మాత్రం సముద్రంలో పడినట్టు తెలిపింది. ఇరాన్ ఎటాక్స్ మొదలైన దగ్గర నుంచీ యూఏఈ మొత్తం 221 బాలిస్టిక్ మిస్సైళ్లకు గాను 205 మిస్సైళ్లను నాశనం చేసింది. 14 మిసైళ్లు సముద్రంలో పడ్డాయి. రెండు యూఏఈ భూభాగంపై పడ్డాయని దేశ రక్షణ శాఖ ఎక్స్‌లో తెలిపింది. ఎనిమిది క్రూజ్ మిస్సైళ్లను ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కనుగొని, నాశనం చేశాయని పేర్కొంది. ఈ దాడుల్లో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు చనిపోయారని, 112 మంది స్వల్ప గాయాలపాలయ్యారని తెలిపింది.
ఇదిలా ఉండగా.. ‘హయ్యా ఏ1 వీసా’ ఉన్న భారత పర్యాటకులు తమ వివరాలు తెలియజేయాలంటూ ఖతార్‌లోని భారత ఎంబసీ ఒక అడ్వయిజరీని జారీ చేసింది. ఇది దేశంలో ఎంత మంది భారతీయులు చిక్కుకుపోయారో తెలుసుకునేందుకేనని పేర్కొంది. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఇతర మధ్య ఆసియా దేశాల్లోని భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు భారతదేశం 96 ప్రత్యేక విమానాలను ఏర్పాటుచేసింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram