విధాత : తెలంగాణలో భూకంపం కలకలం రేపింది. మంచిర్యాల జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 3.9గా భూకంప తీవ్రత నమోదైంది. మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పరిధిలో అర్ధరాత్రి తర్వాత భూ ప్రకంపనలు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లాకు 35 కిలోమీటర్ల దూరంగా భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రజలు నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రి వేళ భూమి కంపించడంలో ఇళ్ల నుంచి లేచి బయటకు పరుగులు తీశారు. భూకంపంతో ఇళ్లలో వస్తువులు కదిలిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో సైతం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ ప్రకంపనలతో ఆ ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే సింగరేణి జోన్ లో భూ ప్రకంపనలు సహజమని..వాటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
USA Nebraska Sinkhole : అమెరికా రోడ్లపై సింక్ హోల్స్ టెర్రర్
Mexican Couple | పడవే వివాహ వేదిక.. వారణాసిలో గంగమ్మ సాక్షిగా ఒక్కటైన మెక్సికో జంట
