పవన్‌కల్యాణ్‌ అభిమాని నిరంజన్‌ మృతి

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్‌(17) హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో కొంతకాలంగా చికిత్స పొందుతున్న నిరంజన్‌ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. ఇటీవలే పవన్ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

Reported by: Y.V. Narsimha Reddy | తెలంగాణ‌ | Jul 08, 2026, 11:33 am IST
Read Time: 3 mins
పవన్‌కల్యాణ్‌ అభిమాని నిరంజన్‌ మృతి

ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కల్యాణ్ అభిమాని నిరంజన్‌(17) హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వరంగల్‌ జిల్లా హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో కొంతకాలంగా చికిత్స పొందుతున్న నిరంజన్‌ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. బాలుడి అనారోగ్య దుస్థిత..అతడు తనను చూడాలని తపిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఇటీవల నిరంజన్‌ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు.

అక్కడ ఆ బాలుడితో మాట్లాడి ధైర్యం చెప్పారు. సెల్ఫీ తీసుకొని రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. హీరో రామ్ చరణ్ వద్ద ఉన్న కుక్కపిల్ల వంటిది కావాలని కోరగా..వెంటనే అలాంటి కుక్కపిల్లను అందించారు. అతను ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇంతలోనే ఆరోగ్యం క్షీణించడంతో నిరంజన్‌ మృతి చెందడం కుటుంబ సభ్యులతో పాటు అందరిని విషాదానికి గురి చేసింది. బాలుడి మరణవార్తను తెలుసుకున్న నటుడు సోనుసూద్ కూడా వర్చువల్ గా తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు.