Mancherial | పెళ్లై 22 రోజులు.. వరకట్న దాహానికి నవవధువు మృతి

6 లక్షల అదనపు కట్నం తేవాలని అత్తింటి వేధింపులు
50 వేలు ఇచ్చిన మర్నాడే నవవధువు ఆత్మహత్య
Mancherial |
వరకట్నం తేవాలని అత్తింటి వేధింపులు అధికమవడంతో మనస్థాపానికి గురైన నవవధువు బాత్‌రూమ్‌లో చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గొల్లపల్లి గ్రామంలో పెళ్లైన 22 రోజులకే అత్తింటి వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది.
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం టికానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు అందులో చిన్నమ్మాయి శృతిని హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయి అనే అబ్బాయికి గత నెల మార్చి 16 న కట్నకానుకలతో ఘనంగా వివాహం జరిపించారు. వివాహ సమయంలో లాంచనాల కింద వరునికి 9 తులాల బంగారం 5 లక్షల నగదు వధువు తల్లిదండ్రులు వరుని కుటుంబానికి అందజేశారు.
పెళ్లి కొడుకు సాయి, అతని తల్లిదండ్రులు మరో 6 లక్షలు అదనపు కట్నం కావాలని మీరిచ్చిన 5 లక్షలు వివాహా వేడుకలకే ఖర్చు అయినట్లు తెలిపారు. యువతి తల్లిదండ్రులకు మరో 6 లక్షల రూపాయలు తేవాలని భర్తతో పాటు అత్తామామలు మానసికంగా వేధిస్తున్నారని తండ్రికి ఫోన్ ద్వారా తెలియడంతో సోమవారం నాడు శృతి తండ్రి శ్రీనివాస్ 50 వేల రూపాయలు అల్లుడు సాయి చేతిలో పెట్టి మిగతా డబ్బు కూడా త్వరలో సర్దుబాటు చేసి అందజేస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
అయినప్పటికీ అత్తింటి వేధింపులు అగకపోవడంతో 6 లక్షలు అడిగితే 50 వేలే ఇచ్చారని వేధింపులు ఎక్కువగా కావడంతో మంగళవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో బాత్రూంలో శృతి తన చున్నీతో ఉరివేసుకొని మృతి చెందింది. అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదుతో మృతురాలి అత్త మామ భర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.