Tiger Tension : పెద్ద పులుల భయంలో తెలుగు రాష్ట్రాలు !
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్దపులుల సంచారం కలకలం రేపుతోంది. గ్రామాల్లో భయం, రైతుల్లో ఆందోళన నెలకొంది. పులులను పట్టుకునేందుకు అటవీ శాఖ భారీ ఆపరేషన్ చేపట్టింది.
విధాత : తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులు ప్రస్తుతం పెద్ద పులుల టెన్షన్ తో వణికిపోతున్నారు. ఒకేసారి తెలంగాణలోని అదిలాబాద్ జిల్లా పరిధిలో ఒకటి, యాదాద్రి భువనగిరి జిల్లా, జనగాం జిల్లాల పరిధిలో మరొక పెద్ద పులి సంచరిస్తుంది. అటు ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి జిల్లాలో మరో పెద్దపులి జనాన్ని నిద్ర లేకుండా చేస్తుంది. వాటిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు రోజలు తరబడిగా ఫలించకపోవడం..నిత్యం ఆవులు, గేదెలు, దూడలపై దాడులు చేస్తుండటంతో ప్రజలు,రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా పొలం పనులు వెళ్లేందుకు రైతులు, రైతు కూలీలు పెద్ద పులుల భయంతో వణికిపోతున్నారు. గ్రామాల్లో ముందస్తుగా డప్పు చాటింపులు వేయిస్తున్నారు.
మేం చిక్కం..దొరకం
వందల మైళ్లు ప్రయాణించి..ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తూ..నదులు దాటుతూ వచ్చిన పెద్ద పులులను పట్టుకునేందుకు ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. పులుల సంచారాన్ని పసిగడుతు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పాదముద్రలను గుర్తిస్తూ వాటి జాడ గుర్తిస్తున్నారు. అయినా తెలివిగా ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తూ..రూట్ లు మార్చుతూ ప్రయాణిస్తూ మేం చిక్కం..దొరుకం అంటూ పగలు పొదలలో, గుట్టలలో దాగి..రాత్రి వేళల్లో దాడులకు తెగబడుతున్న పెద్దపులుల ఎత్తుల ముందు రెస్క్యూ బృందాల ఆటలు సాగకపోవడం జనాలకు మరింత సమస్యగా మారిపోయింది.
ఎక్కడి నుంచి వచ్చాయి..?
యాదాద్రి భువనగిరి జిల్లా వాసులను వణికించి ప్రస్తుతం జనగామా జిల్లా రఘునాథపురంలో సంచరిస్తున్న నాలుగేళ్ల రాయల్ బెంగాల్ టైగర్ మహారాష్ట్ర తడ్వాయి టైగర్ రిజర్వ్ జోన్ నుంచి 300కిలో మీటర్ల మేరకు ప్రయాణించి వచ్చినట్లుగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అదిలాబాద్, నిర్మల్, సిద్దిపేట జిల్లా అటవీ ప్రాంతం నుండి వచ్చిన పులి.. యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా సంచరిస్తూ జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కుందారం గ్రామంలోకి ప్రవేశించింది. పెద్దపులి సంచారం.. జిల్లా ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
ఇకపోతే అదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో తాంసీలో సంచరిస్తున్న పెద్ద పులి మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ జోన్ నుంచి వచ్చినట్లుగా గుర్తించారు. తిప్పేశ్వర్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుండి పెన్‌గంగ నది దాటి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలలో దాని సంచారాన్ని గుర్తిస్తూ పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
600కిలో మీటర్లు నడిచి రాజమండ్రికి..
తూర్పు గోదావరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని జి.ఎర్రపాలెం, రాత్రి క్షేత్రంలో సంచరిస్తున్న మూడేళ్ల మగ పెద్దపులి మహారాష్ట్ర తాడ్వాయి అభయారణ్యం నుంచి 20 రోజులపాటు 600కిలో మీటర్లకు పైగా ప్రయాణించి రాజమండ్రి చేరినట్లుగా గుర్తించారు. గోదావరి నదిని ఈది మరి దాటేసి ఇవలివైపు 50కిలోమీటర్లు నడిచి ఎర్రపాలం జనావాస ప్రాంతంలో తిష్ట వేసింది. ఇప్పటికే పూణే నుంచి ఐదుగురు స్పెషలిస్ట్ బృందం ఈ పెద్దపులిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించింది. డ్రోన్ కెమెరా ద్వారా పులి కదలికలు గుర్తించిన అధికారులు పెద్దపులి కోసం రిస్క్ ఆపరేషన్ చేపట్టారు.
ఇవి కూడా చదవండి :
Woman Attack Liquor Shops In UP : లిక్కర్ షాపులపై మహిళల మూకుమ్మడి దాడి.. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిల్స్ ధ్వంసం
Marriage Scam : టార్గెట్ కట్నం, పెళ్లే వ్యాపారం.. యూపీ వ్యక్తి భారీ మ్యారేజ్ స్కామ్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram