Cold Wave | వామ్మో చలి పులి.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్టోగ్రతలు..!
Cold Wave | రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను చలి పులి వెంటాడుతోంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్టోగ్రతలు తగ్గిపోయి చలితీవ్రత పెరిగింది. దీంతో జనం వణికిపోతున్నారు.
Cold Wave | విధాత, ప్రత్యేక ప్రతినిధి: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ను చలి పులి వెంటాడుతోంది. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్టోగ్రతలు తగ్గిపోయి చలితీవ్రత పెరిగింది. దీంతో జనం వణికిపోతున్నారు. చలితో పాటు పొగమంచు కారణంగా ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు. తాజాగా మరో రెండు, మూడు రోజులు చలి తీవ్రత పెరుగనున్నది. ప్రస్తుత ఉష్టోగ్రతల కంటే 2,3 డిగ్రీలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఉదయం వేళల్లో చలితో పాటు పొగమంచు బెడద పెరుగనున్నది. పొద్దున అడుగుబయటపెట్టాలంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) లో 5.7 డిగ్రీలు నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో సాధారణం కన్నా 5.7 డిగ్రీలు తగ్గి 6.4గా నమోదైంది. హనుమకొండలో 4 డిగ్రీలు తగ్గి 11, ఆదిలాబాద్‌లో 4 డిగ్రీలు తగ్గి 7.7, మెదక్‌లో 3.8 డిగ్రీలు తగ్గి 9, నల్లగొండలో 3.5 డిగ్రీలు తగ్గి 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో 6.5 నుంచి 7.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద 8.1, మౌలాలిలో 9.4, రాజేంద్రనగర్‌లో 9.5, గచ్చిబౌలిలో 11, గాజులరామారంలో 11.4, జీడిమెట్లలో 11.6, అల్వాల్‌లో 12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram