Free Summer Camp | హైదరాబాద్‌లో ఫ్రీ సమ్మర్ క్యాంపు.. సంగీతం, పెయింటింగ్‌పై శిక్షణ
Free Summer Camp | హైదరాబాద్ నగరం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థుల కోసం ఫ్రీ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
Free Summer Camp | హైదరాబాద్ నగరం గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో విద్యార్థుల కోసం ఫ్రీ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఈ క్యాంపు మే 11 నుంచి 16వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది.
పిల్లల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ సమ్మర్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హోండా మోటార్ సైకిల్, స్కూటర్ ఇండియా సహకారంతో ఈ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో ట్రాఫిక్ అవగాహన, రహదారి భద్రత, సెల్ఫ్ డిఫెన్స్, డ్యాన్స్, మ్యూజిక్, పెయింటింగ్, కార్టూనింగ్, హ్యాండ్ రైటింగ్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, ఫస్ట్ ఎయిడ్‌పై అవగాహన కల్పించనున్నారు.
అర్హులు ఎవరంటే..?
ఈ ఉచిత వేసవి శిబిరానికి 6వ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అవకాశం కల్పించనున్నారు.
రిజిస్ట్రేషన్లు ఎప్పట్నుంచంటే..?
ఈ సమ్మర్ క్యాంప్‌కు అర్హులైన విద్యార్థులు మే 3 నుంచి రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ముందుగా వచ్చిన వారికి ముందుగా అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం గోషామహల్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్‌స్పెక్టర్ హరీశ్(8712660655), ఆఫీస్ అసిస్టెంట్(9848063345)ను సంప్రదించొచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram