Murder | సహజీవనంలో ‘కోడిగుడ్డు’ వివాదం.. ప్రియుడిని చంపిన సౌందర్య..!
Murder | ఆమె ఒంటరి మహిళ.. అతను తాపీ మేస్త్రీ.. పని ప్రదేశంలో పరిచయమైన ఆమె.. అతగాడి మనసును దోచేసింది. మనసులు కలిశాయి.. గాఢంగా ప్రేమించుకున్నారు.. ఇంకేముంది సహజీవనానికి స్వాగతం పలికారు. ఆ ప్రేమికులిద్దరూ గత ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చెలరేగిన కోడిగుడ్డు కూర వివాదం.. ప్రియుడి ప్రాణాలను బలితీసుకుంది.
Murder | ఆమె ఒంటరి మహిళ.. అతను తాపీ మేస్త్రీ.. పని ప్రదేశంలో పరిచయమైన ఆమె.. అతగాడి మనసును దోచేసింది. మనసులు కలిశాయి.. గాఢంగా ప్రేమించుకున్నారు.. ఇంకేముంది సహజీవనానికి స్వాగతం పలికారు. ఆ ప్రేమికులిద్దరూ గత ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో చెలరేగిన కోడిగుడ్డు కూర వివాదం.. ప్రియుడి ప్రాణాలను బలితీసుకుంది. ప్రియురాలే ఈ అఘాయిత్యానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మోహన్ వృత్తిరీత్యా తాపీ మేస్త్రీ. బతుకుదెరువు కోసం కొన్నేండ్ల క్రితం నిజామాబాద్ జిల్లాకు వలసొచ్చాడు. వినాయక్ నగరంలో ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. స్థానికంగా నివాసం ఉంటున్న సౌందర్య కూడా కూలీ పనులకు వెళ్లేది. మోహన్, సౌందర్య ఇద్దరు కూడా భవన నిర్మాణాల్లో పని చేస్తుండగా.. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం.. ప్రేమకు దారి తీసింది. అయితే సౌందర్యకు అప్పటికే పెళ్లైంది. కానీ రెండేండ్ల క్రితం విడాకులు తీసుకుంది. ఇక అప్పట్నుంచి ఒంటరిగానే జీవిస్తోంది.
సహజీవనానికి తలుపులు తెరిచారు..
సౌందర్య ఒంటరి మహిళ కావడంతో.. మెహన్ ప్రేమకు కూడా ఎలాంటి అడ్డంకి లేకుండా పోయింది. గాఢ ప్రేమలో మునిగి తేలుతున్న వారిద్దరూ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సహజీవనానికి తలుపులు తెరిచారు. ఎనిమిదేండ్లుగా సహజీవనం చేస్తున్నారు. మోహన్ తల్లి కూడా వీరితోనే ఉంటుంది.
కోడిగుడ్డు కూర వండాలని..
అయితే గత కొద్ది కాలం నుంచి మోహన్ తాగుడుకు బానిస అయ్యాడు. సౌందర్యను వేధించడం ప్రారంభించాడు. ఈ నెల 11న పీకల దాకా మద్యం సేవించి ఇంటికొచ్చాడు మోహన్. తనకు కోడిగుడ్డు కూర వండాలని వేధించాడు. మద్యం మత్తులోనే ఆమెను చితకబాది.. నిద్రలోకి జారుకున్నాడు. మోహన్ వేధింపులు భరించలేని సౌందర్య.. అతని గొంతుకు చీర బిగించి ప్రాణాలు తీసింది.
వేధింపులు భరించలేకనే..
మోహన్ ఉరేసుకుని చనిపోయినట్లు సౌందర్య బుకాయించింది. కానీ పోలీసులకు ఆమె మాటలు నమ్మశక్యంగా కనిపించలేదు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించింది. వేధింపులు భరించలేకనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. నిందితురాలిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram