పరవళ్లు తొక్కుతున్న తెలంగాణ జలపాతాలు
భారీ వర్షాలతో తెలంగాణ జలపాతాలు పరవళ్లు 🌊 గుండాల, బోగతా, కుంటాల, మల్లెల తీర్థం సహా పర్యాటకులను అలరిస్తున్న ప్రకృతి అందాలు.

విధాత : తెలంగాణలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొండ ప్రాంతాల్లోని జలపాతాలు జల సోయగాలతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో.. గుండాల జలపాతం పరవళ్లు సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి.. జలపాతానికి భారీగా వరద నీరు రావడంతో కొండల మధ్యలో నుంచి జలపాతం కిందకు జాలువారుతున్న నీటితో పాలనురుగలు చిందిస్తుంది. ఈ ప్రకృతి అందాన్ని వీక్షించేందుకు సందర్శకులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అదిలాబాద్ జిల్లా పొచ్చెర జలపాతం కూడా పరవళ్లతో అలరిస్తుంది.
అలాగే కుంటాల జలపాతం, సప్తగుండాల, కుమురం భీం జిల్లాలోని కెరమెరి అడవుల్లో జోడేఘాట్(ఖండాల) నీలి జలపాతం, ములుగు జిల్లా బోగతా జలపాతం(తెలంగాణ నయాగర), వాజేడు మండలంలోని గుండం జలపాతం, మాసినిలొద్ది జలపాతం, తిర్యాని, వెంకటాపురం మండలం క్రిసెంట్ (ముత్తారం) జలపాతం, మహబూబాబాద్ జిల్లాలోని ఏడు బావుల జలపాతం, గూడూరు మండలం సీతానగరం బీముని పాదం జలపాతం, పెద్దపల్లి జిల్లాలోని పాండవుల లొంక, ఖమ్మం జిల్లాలో మణుగూరు సమీపంలోని రథం గుట్ట, నాగర్ కర్నూల్ జిల్లాలో మల్లెల తీర్థం జలపాతాలు ప్రస్తుత వర్షకాలంలో ఎతైన ప్రాంతాల నుంచి జాలువారుతూ సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి.
ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో.. పరవళ్లు తొక్కుతున్న గుండాల జలపాతం
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల ధాటికి.. జలపాతానికి భారీగా వచ్చి చేరుతున్న వరద
దీంతో.. కొండల మధ్యలో నుంచి ప్రవహిస్తూ.. కిందకు జాలువారుతున్న జలపాతం
ఈ ప్రకృతి అందాన్ని వీక్షించేందుకు.. తండోపతండాలుగా తరలి… pic.twitter.com/mFvyGAWrsw
— PulseNewsBreaking (@pulsenewsbreak) August 13, 2025
ఇవి కూడా చదవండి…
కరువు నేలపై సిరులు కురిపిస్తున్న అవకాడో పంట.. ఎకరానికి 26 లక్షలు సంపాదిస్తున్న టాటా ఉద్యోగి
భర్తలో శుక్రకణాల లేమి..! సంతానం కోసం కోడలిపై మామ, మరిది అత్యాచారం..!!