Sperm Count | భర్తలో శుక్రకణాల లేమి..! సంతానం కోసం కోడలిపై మామ, మరిది అత్యాచారం..!!
Sperm Count | భర్త( Husband ) చూడడానికి బాగానే ఉన్నాడు. ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఓకే. కానీ అతనిలో శుక్రకణాల( Sperm Count ) సంఖ్య తక్కువగా ఉంది. దీంతో సంతాన ఉత్పత్తికి పనికి రాకుండా పోతున్నాడు. ఇక కోడలి( Daughter in Law )పై మామ( Father in Law ) కన్నేశాడు. సంతానం కోసం పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. మామ ఒక్కడే కాదు.. మరిది కూడా వదిన పట్ల దారుణానికి పాల్పడ్డాడు.

Sperm Count | వడోదర : భర్త( Husband ) చూడడానికి బాగానే ఉన్నాడు. ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా ఓకే. కానీ అతనిలో శుక్రకణాల( Sperm Count ) సంఖ్య తక్కువగా ఉంది. దీంతో సంతాన ఉత్పత్తికి పనికి రాకుండా పోతున్నాడు. ఇక కోడలి( Daughter in Law )పై మామ( Father in Law ) కన్నేశాడు. సంతానం కోసం పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. మామ ఒక్కడే కాదు.. మరిది కూడా వదిన పట్ల దారుణానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన గుజరాత్( Gujarat )లోని వడోదర( Vadodara )లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. వడోదరకు చెందిన 40 ఏండ్ల మహిళకు 2024 ఫిబ్రవరిలో పెళ్లైంది. ఇక అత్తగారింటికి చేరుకున్న ఆమెకు.. భర్త, అత్తమామల నుంచి ఊహించని ఘటన ఎదురైంది. ఈ వయసులో పిల్లలు కనడం కష్టం.. సంతానోత్పత్తికి సంబంధించిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఆమె భర్తలో కూడా శుక్రకణాల సంఖ్య చాలా తక్కువగా ఉందని, పిల్లలు అయ్యే ఛాన్స్ లేదని వైద్యులు తేల్చేశారు. సహజంగా గర్భం దాల్చి, పిల్లలను కనడం కష్టమని చెప్పారు.
ఈ క్రమంలో బాధిత కోడలు ఐవీఎఫ్ విధానంలో చికిత్స తీసుకుంది. కానీ అది విజయవంతం కాలేదు. దీంతో ఒక శిశువును దత్తత తీసుకుందామని భర్తకు, అత్తమామలకు సూచించగా, వారు తిరస్కరించారు. ఇక 2024 జులై నెలలో ఒంటరిగా నిద్రిస్తున్న కోడలి గదిలోకి మామ ప్రవేశించాడు. ఆమెను బలవంతం చేయబోయేసరికి ప్రతిఘటించింది. చెంపపై ఛెల్లుమనిపించిన మామ.. నాతో గడిపి, నా ద్వారానైనా పిల్లలను కని, తమకు వారసుడిని ఇవ్వాలన్నాడు. తన తండ్రి కోరిక తీర్చకపోతే నగ్న ఫొటోలు బయట పెడుతానని అక్కడే ఉన్న భర్త ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. అలా చాలాసార్లు మామ లైంగిక దాడికి పాల్పడ్డాడు. కానీ ఆమె గర్భం దాల్చలేదు.
గతేడాది డిసెంబర్‌లో మామ కాకుండా మరిది ఆమె గదిలోకి ప్రవేశించాడు. పిల్లల కోసం ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది జూన్‌లో ఆమె గర్భం దాల్చింది. కానీ ఆగస్టులో గర్భస్రావం జరిగింది. భర్త, అత్తమామ, మరిది వేధింపులు భరించలేక బాధితురాలు ఈ ఏడాది జులైలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విచారణ జరిపి.. బాధితురాలిని లైంగికంగా, మానసికంగా హింసించిన భర్త, మామ, మరిదిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.