Love Marriage | వీడు మగాడ్రా బుజ్జి.. ఒకే మండపంలో ఇద్దరిని పెళ్లాడాడు..
Love Marriage | కుమ్రంభీం ఆసిఫాబాద్( Asifabad ) జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఒక యువకుడు ఒకే మండపంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి( Marriage ) చేసుకున్న ఘటన మరువక ముందే మరో యువకుడు అదే తరహాలో పెళ్లి చేసుకున్నాడు.

Love Marriage | ఆసిఫాబాద్ : ఓ యువకుడు ఇద్దరమ్మాయిలను ప్రేమించాడు. కానీ ఒకరితోనే సంసారం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న మరో ప్రేమికురాలు( Lover ).. తన పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. చేసేదేమీ లేక ఇద్దరు ప్రియురాళ్లను ఒకే మండపంలో పెళ్లాడాడు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్( Asifabad ) జిల్లా జైనూరు మండలం అడ్డెసర గ్రామంలో చోటు చేసుకుంది.
అడ్డెసర గ్రామానికి చెందిన రంభబాయి, బాద్రుషావ్ దంపతుల రెండో కుమారుడు ఆత్రం చత్రుషావ్. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని నాలుగేండ్ల నుంచి ప్రేమిస్తున్నాడు. కెరమెరి మండలం సాంగ్రి గ్రామానికి చెందిన మరో యువతిని కూడా ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు.
అయితే 15 రోజుల క్రితం ఆమెతో చత్రుషావ్‌కు పెళ్లి చూపులు జరిగాయి. ఈ విషయం తెలుసుకున్న మొదటి ప్రియురాలు.. చత్రుషావ్‌ను తన పరిస్థితి ఏంటని నిలదీసింది. ఇద్దరమ్మాయిలూ చత్రుషావును పెళ్లి చేసుకుంటామని పెద్దలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఒప్పుకోవడంతో పెళ్లి పత్రికలు ముద్రించారు. ఇద్దర్నీ ఒకే మండపంలో బుధవారం వివాహమాడాడు. తన ఇద్దరు ప్రియురాళ్లను బాగా చూసుకుంటానని చత్రుషావ్ హామీపత్రం రాసిచ్చినట్లు బంధువులు తెలిపారు.