• Telugu News
  • /Telangana

మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా భార్య, ఎస్పీ గా భర్త !

భార్యభర్తలకు జిల్లా అధికార యంత్రాంగ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదుగా జరుగుతుంటోంది. తాజాగా గురువారం చేసిన ట్రాన్స్ఫర్లలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్, ఎస్పీగా భార్యాభర్తలకు అవకాశం కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది

Reported by: Tech | తెలంగాణ‌ | Feb 26, 2026, 8:42 pm IST
Read Time: 3 mins
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గా భార్య, ఎస్పీ గా భర్త !

హైలైట్స్:

  • జిల్లా కలెక్టర్, ఎస్పీగా భార్యభర్తలు
  • భార్యాభర్తలకు జిల్లా నిర్వహణ బాధ్యత
  • తాజా బదిలీలలో ప్రభుత్వం ఛాన్స్

విధాత, ప్రత్యేక ప్రతినిధి:  భార్యభర్తలకు జిల్లా అధికార యంత్రాంగ బాధ్యతలు అప్పగించడం చాలా అరుదుగా జరుగుతుంటోంది. తాజాగా గురువారం చేసిన ట్రాన్స్ఫర్లలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా కలెక్టర్, ఎస్పీగా భార్యాభర్తలకు అవకాశం కల్పించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహబూబాద్ జిల్లా ఎస్పీగా ప్రస్తుతం డాక్టర్ శభరీష్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా చేసిన ట్రాన్స్ఫర్లలో అదే జిల్లా కలెక్టర్ గా స్నేహ శభరీష్ కు అవకాశం కల్పించారు. స్నేహ శభరీష్ హనుమకొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఆమెను మహబూబాద్ కలెక్టర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భర్త ఎస్సీగా పనిచేస్తున్న జిల్లాకు భార్యను కలెక్టర్ గా నియమించడం గమనార్హం. కొద్ది రోజుల క్రితమే శభరీష్ ను ములుగు జిల్లా ఎస్పీ నుంచి మహబూబాద్ జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. భార్యాభర్తలిద్దరికి ఒకే జిల్లాలో అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఇద్దరు వేర్వేరు ఉద్యోగాల్లో ఉంటే వేరుగానీ, మొత్తం జిల్లా నిర్వహణలో ప్రాధాన్యమైన కలెక్టర్, ఎస్పీలకు ఈ అవకాశం కల్పించడం విశేషం. అదే విధంగా ఎన్పీడీసీఎల్ ఎండిగా వరుణ్ రెడ్డి, ఆయన భార్య చాహత్ బాజ్ పాయ్ నిన్నటి వరకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ గా ఒకే జిల్లాలో విధులు నిర్వహించగా తాజాగా చాహత్ బాజ్పాయ్ ను హనుమకొండ నూతన కలెక్టర్గా బదిలీ చేస్తూ గ్రేటర్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.