SERP | మహిళా సంఘాల రీపేమెంట్ 98.5శాతం.. ఆదర్శనీయమన్న మంత్రి సీతక్క
SERP | బడా పారిశ్రామిక వేత్తలు వేలకోట్ల రుణాలు ఎగవేస్తున్న దేశంలో 98.5% రీపేమెంట్‌తో మహిళా సంఘాలు దేశ అభివృద్ధికి మార్గం చూపిస్తున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. గురువారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో సెర్ఫ్ వార్షిక యాక్షన్ ప్లాన్ 2025-26ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారత కోసం వార్షిక యాక్షన్ ప్లాన్ ఉపకరిస్తుందన్నారు. మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు మరింత సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వారికి రుణాలను విరివిగా మంజూరు చేయాలని కోరారు. తమ ప్రభుత్వం మహిళలు పారిశ్రామికంగా ఎదిగేందుకు అమలు చేస్తున్న పథకాలకు అవసరమైన తోడ్పాటును బ్యాంకర్లు కూడా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ సీఈవో దివ్య దేవరాజన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram