• Telugu News
  • /Telangana

Seethakka : మంత్రి సీతక్క చొరవ..పంచాయ‌తీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ‌లో ప‌దోన్న‌తులు

మంత్రి సీతక్క చొరవతో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘ విరామం తర్వాత ప్రమోషన్లు కల్పించారు. అధికారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Feb 20, 2026, 1:28 pm IST
Read Time: 2 mins
Seethakka : మంత్రి సీతక్క చొరవ..పంచాయ‌తీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ‌లో ప‌దోన్న‌తులు

విధాత, హైదరాబాద్ : పంచాయ‌తీ రాజ్,గ్రామీణాభివృద్ది శాఖ‌ మంత్రి సీతక్క చొరవతో ఆ శాఖలలో సుదీర్ఘ‌కాలం త‌ర్వాత సిబ్బందికి ప్ర‌మోష‌న్లు దక్కాయి. 27 డిప్యూటీ సీఈఓలు సీఈఓలుగా పదోన్నతులు పొందారు. అలాగే 55మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతులు పొందారు.

ఈ సందర్బంగా పదోన్నతి పొందిన అధికారులు ప్ర‌జా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసి సన్మానించారు. సుదీర్ఘకాలం తర్వాత ప్రమోషన్లు కల్పించినందుకు వారంతా కృతజ్ఞతలు తెలిపారు. మంత్రికి స్వీట్లు తినిపించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీతక్క స్పందిస్తూ..ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఒక్కో హామీని ప్రభుత్వం నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Toxic Teaser: యశ్​ కొత్త అవతారం… హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌తో సంచలనం
Toxic Teaser: యశ్​ కొత్త అవతారం… హాలీవుడ్‌ స్థాయి విజువల్స్‌తో సంచలనం